కరోనా బాధితుల సహాయార్ధం రాష్ట్ర న్యాయ సమాజం తరఫున ప్రధానమంత్రి సహాయ నిధికి విరాళం ఇచ్చేందుకు హైకోర్టు నిర్ణయించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి, న్యాయమూర్తులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నేపథ్యంలో హైకోర్టు సీజే రూ.50 వేలు, మిగిలిన హైకోర్టు జడ్జీలు రూ.25 వేల చొప్పున విరాళం ఇచ్చేందుకు ముందుకొచ్చారు. హైకోర్టు రిజిస్ట్రీ అధికారులతో సంప్రదించి ఫుల్ కోర్టులో చర్చించాక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లా కోర్టుల్లోని ప్రధాన న్యాయమూర్తులు, సిబ్బంది, దిగువ కోర్టుల్లోని సిబ్బంది పీఎంసీఏఆర్‌ఎస్ నిధికి విరాళం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తూ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ సర్క్యులర్ జారీ చేశారు. ఈ విరాళాలు స్వచ్ఛందంగా ఇచ్చేవేనని, విరాళం ఇవ్వకూడదనుకున్న వారు రిజిస్ట్రార్‌కు సమాచారం ఇవ్వాలన్నారు. విరాళాలిచ్చిన అధికారులు, ఉద్యోగుల హోదా, ఉద్యోగి కోడ్, తదితర వివరాలతో జాబితా సిద్ధం చేసి ఈ నెల 15లోపు హైకోర్టుకు పంపాలని కోరారు.
కరోనా బాధితులకు అండగా ఏపీ న్యాయ సమాజం - ప్రధానమంత్రి సహాయ నిధి తాజా వార్తలు
కరోనా బాధితుల సహాయార్ధం ఏపీ న్యాయ సమాజం తరఫున ప్రధానమంత్రి సహాయ నిధికి విరాళం సేకరించేందుకు హైకోర్టు నిర్ణయించింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి న్యాయమూర్తులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. విరాళాలు ఇచ్చేందుకు దిగువ కోర్టులోని సిబ్బంది, అధికారులు కూడా ముందుకు రావాలని విజ్ఞప్తి చేస్తూ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ సర్క్యులర్ జారీ చేశారు.
![కరోనా బాధితులకు అండగా ఏపీ న్యాయ సమాజం andhrapradesh nyaya samajam give danation](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6717410-77-6717410-1586370038180.jpg)
కరోనా బాధితులకు ఏపీ న్యాయ సమాజం విరాళాలు సేకరణ