ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Virtual Hearings: కొవిడ్ వ్యాప్తి దృష్ట్యా హైకోర్టులో ఆంక్షలు - ఏపీలో కరోనా ఆంక్షలు

Virtual Hearings in ap high court: కొవిడ్ వ్యాప్తి దృష్ట్యా కేసుల విచారణపై హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 17 నుంచి కేసుల విచారణ వర్చువల్​గా చేపట్టాలని సర్కులర్ ఇచ్చింది.

Virtual Hearings in ap high court
Virtual Hearings in ap high court

By

Published : Jan 11, 2022, 4:28 PM IST

Virtual Hearings in ap high court: కొవిడ్ వ్యాప్తి దృష్ట్యా హైకోర్టులో ఆంక్షలు విధించారు. ఈ మేరకు ఈనెల 17 నుంచి కేసుల విచారణ వర్చువల్‌గా చేపట్టాలని ఉన్నత న్యాయస్థానం నిర్ణయించింది. అన్ని కోర్టులు, ట్రైబ్యునళ్లలోనూ వర్చువల్‌గానే విచారణ చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వుల జారీ వరకు వీడియోకాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టనున్నట్లు.. హైకోర్టు రిజిస్ట్రార్ సర్కులర్ విడుదల చేశారు.

సుప్రీంలోనూ వర్చువల్​ విధానం..

Supreme Court Virtual Hearing: సుప్రీం కోర్టు కార్యకలాపాలపై కూడా కరోనా ఎఫెక్ట్​ పడింది. దేశంలో ఒమిక్రాన్​ వేరియంట్​ సహా కరోనా కేసులు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్న నేపథ్యంలో.. వర్చువల్​ విచారణలకు సిద్ధమైంది. జనవరి 3వ తేదీ నుంచి రెండు వారాల పాటు అన్ని కేసుల విచారణలు వర్చువల్​గానే జరుగుతాయని అత్యున్నత న్యాయస్థానం ఓ ప్రకటన విడుదల చేసింది. హైబ్రిడ్​ పద్ధతిలో కోర్టు నిర్వహణకు వీలుగా 2021 అక్టోబర్​ 7న జారీచేసిన ప్రామాణిక నిర్వహణ నిబంధనలను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. కరోనా మహమ్మారి విజృంభించిన నేపథ్యంలో.. గతేడాది మార్చి నుంచి సుప్రీం కోర్టు విచారణ.. వీడియో కాన్ఫరెన్స్​లోనే జరిగింది. అక్టోబర్​ 7న మళ్లీ భౌతిక విచారణ ప్రారంభమైంది.

ఇదీ చదవండి:

night curfew in ap: రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ వాయిదా.. ఎందుకంటే

ABOUT THE AUTHOR

...view details