పీజీ వైద్య కళాశాలల్లో ఫీజులు తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 56ను అమలు చేయాలంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే పీజీ అడ్మిషన్లు పొందిన విద్యార్థులను చేర్చుకోవాలని ప్రైవేటు వైద్య కళాశాలలను న్యాయస్థానం ఆదేశించింది.
జీవో 56 అమలు కోరుతూ సామాజిక కార్యకర్త సురేశ్‌బాబు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ జరిపిన న్యాయస్థానం... ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. మిగతా పిటిషన్లు కూడా విచారించాక తుది తీర్పు ఇస్తామని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం చెప్పింది.