ఏపీ న్యాయవాదులకు శిక్షణ అవసరమని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జే కే మహేశ్వరి అభిప్రాయపడ్డారు. ప్రధానంగా జూనియర్ న్యాయవాదులకు శిక్షణ ఇచ్చేందుకు అకాడమీ ఏర్పాటు చేసేలా ప్రభుత్వం, బార్ కౌన్సిల్ చొరవ చూపాలని అన్నారు. హైకోర్టు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఏపీ బార్ కౌన్సిల్ వెబ్సైట్(www.barcouncilap. org) మొబైల్ యాప్ను ప్రారంభించారు. ప్రతి హైకోర్టులో అడ్వకేట్స్ అకాడమీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మధ్యప్రదేశ్లో శిక్షణ ఇచ్చేందుకు సిద్ధమైనప్పటికీ న్యాయవాదులు ముందుకు రాక ఆ ప్రక్రియ నిలిచిపోయిందన్నారు.
వెబ్సైట్ పనితీరు అద్భుతం
ఏపీ బార్ కౌన్సిల్ వెబ్సైట్ పనితీరు అద్భుతంగా ఉందని జస్టిస్ జేకే మహేశ్వరి అన్నారు. ఎప్పటికప్పుడు వివరాల్ని పొందుపరచడం ద్వారా న్యాయవాదులకు, ప్రజలకు బార్ కౌన్సిల్ కార్యకలాపాల గురించి తెలుస్తుందన్నారు.