కృష్ణా జిల్లా అవనిగడ్డకు ఆంధ్రప్రదేశ్ రాష్టంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన 450 మంది డీఎస్సీ విద్యార్ధులను... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలనుసారం 17 బస్సుల ద్వారా వారి స్వస్థలాలకు తరలించారు. ఈ కార్యక్రమాన్ని జెండా ఊపి అవనిగడ్డ శాసన సభ్యుడు సింహాద్రి రమేష్ బాబు, దివి మార్కెట్ యార్డ్ చెర్మన్ కడవకొల్లు నరసింహారావు తదితరులు ప్రారంభించారు. విద్యార్ధులకు ఆహారం, తాగునీరు అందించారు. తమకు ఇన్నాళ్ళు ఏలోటు లేకుండా చుసినందుకు ప్రజాప్రతినిధులకు, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణా రాష్ట్రం నుంచి వచ్చిన విద్యార్ధులు సుమారు పదిమంది ఇక్కడే ఉన్నారని... వేరే రాష్ట్రానికి పంపటానికి అనుమతులు రాగానే వారిని కూడా వారి స్వస్థలాలకు పంపుతామని అధికారులు తెలిపారు.
సొంతగూటికి చేరుకున్న 450మంది విద్యార్థులు - corona news in andhrapradesh
కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు రాష్ట్రంలో వివిధ జిల్లాల నుంచి వారిని తరిలించేందుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. కృష్ణాజిల్లా అవనిగడ్డలో 450మంది డీఎస్సీ విద్యార్థులను ప్రభుత్వ బస్సుల్లో ఆయా జిల్లాలకు పంపించే ఏర్పాట్లు చేశారు.
ap govt states bus services to get back students from their own places