mana badi nadu nedu phase 2 works: మనబడి, ‘నాడు-నేడు’ కింద రెండోదశలో పనులు చేపట్టే విద్యాసంస్థల సంఖ్యను ప్రభుత్వం భారీగా కుదించింది. నిధుల కొరతతోనే ఈ చర్య తీసుకుంది. రెండో విడతలో 16,368 విద్యాసంస్థల్లో రూ.4,535 కోట్లతో పనులు చేపట్టనున్నట్లు గతేడాది ఆగస్టు 16న ప్రభుత్వం ప్రకటించింది. కానీ నాటినుంచి పనులే ప్రారంభం కాలేదు. తాజాగా రూ.2,538.96 కోట్లతో 3,199 పాఠశాలల్లోనే ఈ పనులకు పరిపాలన అనుమతులు మంజూరుచేసింది. నాబార్డు నుంచి రుణం, ప్రభుత్వ వాటా కాకుండా మిగతా మొత్తాన్ని విరాళాల ద్వారా సేకరించనున్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విరాళాలను తీసుకోవాలని నిర్ణయించింది. నూతన విద్యావిధానం అమల్లో భాగంగా 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలలకు తరలించడంతో అదనపు తరగతి గదుల అవసరం ఏర్పడింది.
నాబార్డు రుణం రూ.1,379 కోట్లతో 1,196 బడుల్లో సుమారు 11,485 అదనపు తరగతి గదులు నిర్మించేందుకు అంచనాలు రూపొందించారు. మరో 2003 బడుల్లో నాబార్డు నిధులు రూ.1,161 కోట్లతో అదనపు తరగతి గదులు, ఇతర మౌలికసదుపాయాలు కల్పించనున్నారు. నాబార్డు నిధులకు 30% ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంటు ఇవ్వాలి. అదనపు తరగతి గదులు నిర్మించేవాటిలో కొన్ని మొదటి విడత పాఠశాలలు ఉన్నాయి. మొదటి విడత పనులను ప్రపంచబ్యాంకు బృందం పరిశీలిస్తోంది. ఈ పనులకు ప్రపంచబ్యాంకు నిధులు వస్తే వాటిని రెండో విడతకు వినియోగించాలని అధికారులు భావిస్తున్నారు.
మొదటి విడతకే బకాయిలు