ఆరోగ్యశ్రీ కార్డులు కొత్తదనాన్ని సంతరించుకున్నాయి. వైకాపా ప్రభుత్వం ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డును ఆకర్షణీయమైన డిజైన్‌తో ముద్రించి తాజాగా లబ్ధిదారులకు అందజేస్తోంది. మోపిదేవి మండలంలో దాదాపు 11 వేల కార్డులు వచ్చినట్లు రెవెన్యూ వర్గాలు పేర్కొన్నాయి. డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వారా వీటిని జారీ చేశారు. ముందు భాగంలో కార్డుదారుని ఫొటో ముద్రించారు. కార్డుకు రెండో వైపు కుటుంబ సభ్యుల వివరాలతో పాటు కార్డు ఉద్దేశం, లబ్ధిదారులు, వైద్య సహాయం, నమోదు సమాచారం, అత్యవసర పరిస్థితుల్లో కార్డు ఉపయోగాలు, ఉచిత వైద్య సదుపాయాల వివరాలు ఉన్నాయి. ఈ కార్డు కలిగిఉన్న ప్రతి కుటుంబానికీ రూ.5 లక్షల మేర ఉచిత వైద్యం అందిస్తారు.
కొత్త ఆరోగ్యశ్రీ కార్డులు జారీ - latest news of Aarogyasri
ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డును ఆకర్షణీయమైన డిజైన్‌తో ముద్రించి తాజాగా లబ్ధిదారులకు అందజేస్తోంది ప్రభుత్వం. కృష్ణా జిల్లా మోపిదేవి మండలంలో దాదాపు 11వేల కార్డులు పంపిణీ చేసినట్లు రెవెన్యూ వర్గాలు తెలిపాయి.
ysr helth cards