ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

''మహాత్ముడి బోధనలను చాటేందుకు ఇదే సరైన సమయం'' - AP GOVERNOR

మహాత్మాగాంధీ 150వ జయంతి.. సత్యం, అహింసల పట్ల ఆయన నిబద్ధతను ప్రపంచానికి చాటిచెప్పేందుకు ఇదే సరైన సమయమని గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ అన్నారు. స్వచ్ఛభారత్‌, మహిళలు, బాలల హక్కులు వంటి అనేక కార్యక్రమాలకు ఆ మహాత్ముడి బోధనలే స్ఫూర్తి అని కొనియాడారు.

ap-governor-in-gandhi-birthday-celebrations

By

Published : Oct 2, 2019, 1:04 PM IST

'ప్రపంచవ్యాప్తంగా అనేక మందికి మహాత్ముడు స్ఫూర్తి'

విజయవాడలో మహాత్మాగాంధీ 150వ జయంతి వేడుకల్లో రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పాల్గొన్నారు. సత్యం, అహింసల పట్ల ఆయన నిబద్ధతను ప్రపంచానికి చాటిచెప్పేందుకు సరైన సమయం ఇదే అని ఆయన అన్నారు. స్వచ్ఛభారత్‌, మహిళలు, బాలల హక్కులు వంటి అనేక కార్యక్రమాలకు మహాత్ముడి బోధనలే స్ఫూర్తి అని కొనియాడారు. పౌరహక్కులు, స్వేచ్ఛ కోసం ఉద్యమించేలా ప్రపంచవ్యాప్తంగా అనేక మందికి మహాత్ముడు స్ఫూర్తిగా నిలిచారని.... అందుకే ఆయన జన్మదినాన్ని అంతర్జాతీయ అహింసా దినంగా నిర్వహించుకుంటున్నామని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details