పెట్టుబడిలేని ప్రకృతి వ్యవసాయానికి రైతులు సన్నద్దం కావాలని.. ఆ దిశగా ప్రభుత్వాలు దేశంలోని రైతులను ప్రోత్సహించాలని రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. రసాయనిక ఎరువులు, పురుగు మందులతో కూడిన వ్యవసాయాలను క్రమంగా విడిచి పెట్టాలని సూచించారు. హరియాణా రాష్ట్రం కురుక్షేత్రలోని గురుకులంలో వ్యవసాయ రంగంలో సంస్కరణలు అనే అంశంపై జరిగిన జాతీయ సదస్సులో గవర్నర్ పాల్గొన్నారు. 2019 - 20లో 2.32 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో 5.80 లక్షల మంది రైతులను ప్రకృతి వ్యవసాయం పరిధిలోకి తీసుకురావటానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని తెలిపారు. ఈ సదస్సుకు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరాజన్, మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారి, గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవ్ వ్రత్, హర్యానా గవర్నర్ సత్యదేవ్ నారాయణ్ ఆర్య, ఎంపి గవర్నర్ లాల్జీ టాండన్ తదితరులు హాజరయ్యారు. భారత్ లో వ్యవసాయ రంగ సంస్కరణలకు అవసరమైన కాలానుగుణ సిఫారసులపై చర్చించారు. అనంతరం ఆరు రాష్ట్రాల గవర్నర్లు హర్యానాలోని కురుక్షేత్ర సమీపంలోని వ్యవసాయ క్షేత్రాలను సందర్శించారు.
ప్రకృతి వ్యవసాయానికి రైతులు సన్నద్దం కావాలి: గవర్నర్ - AP Governor Biswabhushan Harichandan latest
హరియాణా కురుక్షేత్ర గురుకులంలో వ్యవసాయ రంగంలో సంస్కరణలు అనే అంశంపై జరిగిన జాతీయ సదస్సులో రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పాల్గొన్నారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరాజన్, మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారి, గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవ్ వ్రత్, హర్యానా గవర్నర్ సత్యదేవ్ నారాయణ్ ఆర్య, ఎంపి గవర్నర్ లాల్జీ టాండన్ తదితరులు హాజరయ్యారు.

Telangana Governor Tamilsai Soundarajan, Maharashtra Governor Bhagat Singh Koshyari, Gujarat Governor Acharya Dev Wrath, Haryana Governor Satyadev Narayan Arya, MP Governor Lalji Tandon
పెట్టుబడిలేని ప్రకృతి వ్యవసాయానికి రైతులు సన్నద్దం కావాలి..గవర్నర్ బిశ్వభూషన్
ఇదీ చూడండి
TAGGED:
Haryana and Kurukshetra