ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'ప్రవాసాంధ్రుల పెట్టుబడిని ప్రభుత్వం తిరిగి చెల్లించాలి'

By

Published : Oct 5, 2020, 4:50 PM IST

అమరావతిలో ప్రవాసాంధ్రులు 48 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారని ఇండో- అమెరికన్ బ్రాహ్మణ ఫెడరేషన్ ఛైర్మన్ బుచ్చి రామ్ ప్రసాద్ వెల్లడించారు. రాజధాని విషయంలో వైకాపా ప్రభుత్వం తీరుపై వారంతా ఆందోళన చెందుతున్నారని అన్నారు. ఏపీ ఎన్​ఆర్​ఐల సమస్యలను త్వరలో కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు.

TDP leader BuchiRamPrasad
TDP leader BuchiRamPrasad

ప్రవాసాంధ్రుల సమస్యలను వైకాపా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఇండో- అమెరికన్ బ్రాహ్మణ ఫెడరేషన్ ఛైర్మన్ బుచ్చి రామ్ ప్రసాద్ విమర్శించారు. అమరావతిలో ఎన్​ఆర్​ఐలు పెట్టిన పెట్టుబడులను ప్రభుత్వం తక్షణమే వెనక్కి ఇవ్వాలని ఆయన డిమాండ్‌చేశారు. ఐకాన్స్ టవర్స్ నిర్మాణంలో భాగస్వాములయ్యేందుకు వారు 48 కోట్ల రూపాయల వరకు చెల్లించారన్నారు.

హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ కింద వారు కొనుగోలు చేసిన ఫ్లాట్లను అభివృద్ధి చేయాలన్న ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి లేకుండా పోయిందని దుయ్యబట్టారు. అమరావతి నిర్మాణం ఆగిపోవటంపై ప్రవాసాంధ్రులంతా తీవ్ర ఆందోళనలో ఉన్నారని రామ్ ప్రసాద్ తెలిపారు. ప్రభుత్వ తీరుపై ఇప్పటికే న్యాయ స్థానాలను ఆశ్రయించామన్న ఆయన...‌ ప్రవాసాంధ్రుల సమస్యలను త్వరలోనే కేంద్రం దృష్టికి కూడా తీసుకెళతామని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details