ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో ఏర్పాటు - ఏపీ ప్రభుత్వం వార్తలు

రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంటు బ్యూరోను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మద్యం అక్రమ తయారీ, రవాణాను అడ్డుకోవడం, ఇసుక అక్రమాలను నిరోధించడం దీని ప్రధాన విధులు. డీజీపీ ఆధ్వర్యంలో ఈ విభాగం పనిచేస్తుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.

special-enforcement-bureau
special-enforcement-bureau

By

Published : May 9, 2020, 10:25 PM IST

మద్యం, ఇసుక అక్రమాలను అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంటు బ్యూరోను ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. సాధారణ పరిపాలన శాఖలో భాగంగా ప్రత్యేక ఎన్‌ఫోర్స్​మెంట్‌ బ్యూరో విభాగం విధులు నిర్వహించనుంది. మద్యం అక్రమ తయారీ, రవాణాను అడ్డుకోవడం, ఇసుక అక్రమాలను నిరోధించడం దీని ప్రధాన విధులు. ప్రస్తుతం ఎక్సైజ్‌ కమిషనర్‌ ఆధ్వర్యంలో ఉన్న డైరెక్టర్‌ ఆఫ్‌ ప్రొహిబిషన్‌ పోస్టు స్థానంలో దీనిని ఏర్పాటు చేసింది. డీజీపీ ఆధ్వర్యంలో ఈ విభాగం పనిచేస్తుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఈ విభాగానికి ఐజీ స్థాయిలో ఓ కమిషనర్ హోదాతో పోస్టు కూడా ఏర్పాటు చేసింది. 13 జిల్లాల్లో 18 పోలీసు యూనిట్లు విభాగం కింద పనిచేస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఇకపై ఎక్సైజ్‌ కమిషనర్..‌ లైసెన్స్‌లు, స్టాక్‌, విక్రయాలు, ఉత్పత్తి వంటి రోజువారీ అంశాలు మాత్రమే చూస్తారు. కొద్దిమంది సిబ్బంది మాత్రమే ఆయన పర్యవేక్షణలో ఉంటారు. మిగతా సీఐలు, ఎస్సైలు వంటి వారంతా ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంటు బ్యూరో పరిధిలోకి వస్తారు.

ABOUT THE AUTHOR

...view details