ఆంధ్రప్రదేశ్ రాబోయే అయిదేళ్ల కాలానికిగానూ రూ. 9 లక్షల నిధులు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘాన్ని కోరినట్లు సమాచారం. రాష్ట్రానికి భారీగా నిధులివ్వడం, అదనపు కేటాయింపులు చేయడంతో పాటు ప్రత్యేక హోదాను కూడా ప్రకటించాలని విన్నవించినట్లు తెలిసింది. ఈ మేరకు సవరించిన వినతిపత్రంతో కూడిన లేఖను 15వ ఆర్థిక సంఘానికి పంపినట్లు భోగట్టా.
'రాష్ట్రానికి రూ. 9 లక్షల కోట్ల నిధులివ్వండి' - 15వ ఆర్థిక సంఘం
రాష్ట్ర అభివృద్ధికి రూ.9 లక్షల నిధులు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘాన్ని కోరినట్లు సమాచారం. ఈ మేరకు సవరించిన వినతిపత్రంతో కూడిన లేఖను 15వ ఆర్థిక సంఘానికి పంపినట్లు భోగట్టా.
!['రాష్ట్రానికి రూ. 9 లక్షల కోట్ల నిధులివ్వండి' ap government request finance commission](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8411854-399-8411854-1597362433146.jpg)
విశ్వసనీయ సమాచారం మేరకు.. రాజధాని నగర నిర్మాణం, అభివృద్ధికి భారీగా నిధులివ్వాలని లేఖలో ప్రస్తావించింది. అయితే రాజధాని ఎక్కడన్నా విషయాన్ని పొందుపరచలేదు. రాజ్‌భవన్, హైకోర్టు, సచివాలయం, శాసనసభ భవన నిర్మాణాలకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుందంటూ విభజన చట్టంలో పేర్కొన్న అంశాన్ని లేఖలో ప్రస్తావించింది. విశాఖపట్నం నగర అభివృద్ధికి రూ.4 వేల కోట్లు విడుదల చేయాలని కోరింది. ఈ నిధులతో రోడ్లు, తాగునీరు, విద్యుత్తు, అవసరమైన భవన నిర్మాణం వంటివి చేపట్టనున్నట్లు పేర్కొంది. రాష్ట్రం కోరుతున్న కేటాయింపులకు సంబంధించి 15వ ఆర్థిక సంఘానికి గత ప్రభుత్వ హయాంలోనే లేఖ రాశారు. ఈ సంఘం ఇంకా తుది నివేదిక సమర్పించలేదు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన సందర్భంగా ప్రాధాన్యాలు మారాయని, కోవిడ్ పరిస్థితులు కూడా ఉన్నందున తదునుగుణంగా నిధులు కేటాయించాలని కోరుతూ తాజాగా సవరించిన వినతిపత్రాన్ని పంపించినట్లు సమాచారం. దానిలోని ప్రధానాంశాలివీ...
- రాజధాని నిర్మాణానికి రూ. 2,500 కోట్లు ఇస్తామని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం రూ.1,500 కోట్లే ఇచ్చింది. న్యాయ వ్యవస్థ భవనాలకు రూ. 1,849 కోట్లు,శాసన వ్యవస్థ కోసం రూ. 1,397 కోట్లు, పరిపాలన వ్యవస్థ కోసం రూ. 5099 కోట్లు ఖర్చవుతాయి.
- వాటర్ గ్రిడ్ ఏర్పాటుకు , కొత్త జిల్లాల ఏర్పాటులో పాలనపరమైన అవసరాలకు, రాయలసీమ కరవు నివారణకు ప్రాజెక్టుకు నిధులు కేటాయించాలి.
- ప్రాంతీయ అభివృద్ధి గ్రాంట్ కింద నిధులు ఇవ్వాలి.
ఇదీ చూడండి.108 సిబ్బంది మానవత్వం.. కరోనా బాధితురాలికి ప్రసవం