ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'వరుణుడు కనికరించినా... సర్కార్ సహకరించటం లేదు' - farmers problems in ap

రైతుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అశ్రద్ధ చూపుతోందన్నారు తెలుగుదేశం పార్టీ నేత కళా వెంకట్రావు. వారికి సకాలంలో విత్తనాలు, ఎరువులు, రుణాలు అందటం లేదని తెలిపారు. ఖరీఫ్‌ మొదలై 2 నెలలైనా వ్యవసాయంపై సర్కార్ సమీక్ష చేయలేదని దుయ్యబట్టారు.

kala venkata rao
kala venkata rao

By

Published : Aug 30, 2020, 7:26 PM IST

రైతుల ఇబ్బందులను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు విమర్శించారు. వరుణుడు కనికరించినా...కర్షకులకు సర్కార్ సహకరించటం లేదని అన్నారు. ఖరీఫ్‌ మొదలై 2 నెలలైనా వ్యవసాయంపై సమీక్ష చేయలేదని దుయ్యబట్టారు.

గ్రామాల్లో పంట రుణాలపై ముఖ్యమంత్రి జగన్ ఎందుకు దృష్టి పెట్టలేదని కళా వెంకట్రావు ప్రశ్నించారు. రైతులకు సకాలంలో విత్తనాలు, ఎరువులు, రుణాలు అందటం లేదని తెలిపారు. వ్యాపారులు యూరియా బస్తాకు 200 రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నారని కళా వెంకట్రావు వెల్లడించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details