సచివాలయ ఆరోగ్య మిత్రలుగా ఏఎన్ఎంలు, గ్రామ, వార్డు సచివాలయ ఆరోగ్య సహాయకులను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆరోగ్యశ్రీకి సంబంధించిన అంశాలన్నీ సచివాలయ ఆరోగ్య మిత్రలు పర్యవేక్షిస్తారని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆరోగ్య శ్రీ ట్రస్టు సీఈఓ సిఫార్సుల మేరకు ఏఎన్ఎంలు, గ్రామ, వార్డు సచివాలయ ఆరోగ్య సహాయకులకు కొత్తగా ఈ బాధ్యతలు అప్పగిస్తూ వైద్యారోగ్యశాఖ నిర్ణయం తీసుకుంది.
సచివాలయ ఆరోగ్య మిత్రల విధులు
- ఆరోగ్య శ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు లబ్ధిదారులను పంపించాలి
- నగదు రహిత చికిత్సకు సహకరించాలి
- రోగుల దరఖాస్తులను పరిశీలించి ఆన్లైన్ పోర్టల్లో నమోదు చేయాలి
- రోగులకు ఆస్పత్రుల్లో చికిత్స అందించేందుకు అవసరమైన సహకారాన్ని అందించాలి
- ఆరోగ్యశాఖకు సంబంధించిన ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి
- ఆరోగ్య క్యాంపుల్లో పాల్గొనాలి