ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే కరోనా చికిత్స అందించాలి: సీఎం - ప్రభుత్వం నిర్ధేశించిన ధరలకే కరోనా చికిత్స

రాష్ట్రంలో కొవిడ్ చికిత్స కోసం ప్రైవేటు ఆస్పత్రులు వసూలు చేసే ఛార్జీలు, అత్యవసర ఖరీదైన ఔషధాల వినియోగంపై ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. కొవిడ్ చికిత్సలో ఖరీదైన ఔషధాల వినియోగంపై పరిమితులు విధిస్తూ ఈ ఆదేశాలు వెలువడ్డాయి. దీంతో పాటు కొవిడ్ చికిత్స పురోగతి పరిశీలనకు చేసే సీటీస్కాన్ పరీక్షలపైనా పరిమితులు విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం నిర్దేశించిన ధరల కంటే చికిత్సకు అదనంగా వసూలు చేయకుండా పర్యవేక్షించాలంటూ జిల్లాల వైద్యాధికారులను ప్రభుత్వం ఆదేశించింది.

ap government
ap government

By

Published : Jul 21, 2020, 12:15 AM IST

కొవిడ్ చికిత్సల్లో కీలకమైన, ఖరీదైన ఔషధాల వినియోగం.. చికిత్స ఖర్చులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. కొవిడ్ రోగుల నుంచి అదనపు ధరలు వసూలు చేయకుండా పర్యవేక్షించాల్సిందిగా ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. కొవిడ్ చికిత్సలో కీలకమైన సైటోకైన్ స్టార్మ్ సిండ్రోమ్ కోసం వినియోగించే టోసిలిజుమాబ్ ఇంజక్షన్, కొవిడ్ చికిత్సకు వినియోగించే యాంటీవైరల్ డ్రగ్ రెమ్డెసివిర్, మెరోపెనామ్ యాంటీ వైరల్ డ్రగ్ గా ఉన్న టాబ్లెట్ ఫావిపిరవిర్ లాంటి ఔషధాలను అత్యవసర సందర్భాల్లో మాత్రమే అదనపు డోసులుగా వినియోగించాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఐసీఎంఆర్ సూచించిన ఈ ఔషధాలపై ఉన్న ఎంఆర్పీ రేట్లనే వసూలు చేయాలని స్పష్టం చేసింది. అవసరం లేకపోయినా ఈ ఔషధాల అదనపు డోసులు వినియోగిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఆస్పత్రులకు స్పష్టం చేసింది. అటు కొవిడ్ చికిత్స పురోగతిని పరీశీలించేందుకు చేసే సీటీ స్కాన్ లను ఇష్టానుసారం వసూలు చేయకుండా.. ఆదేశాలు ఇచ్చింది.

ఊపిరితిత్తుల్లో కొవిడ్ వైరస్ తీవ్రత తెలుసుకునేందుకు వినియోగించే సీటీ స్కాన్​కు గరిష్టంగా 2500 మాత్రమే వసూలు చేయాలని స్పష్టం చేసింది. ఆరోగ్యశ్రీ ట్రస్టులో నమోదు అయిఉన్న ఆస్పత్రులన్నీ.. ఈ ఔషధాల వినియోగానికి సంబంధించిన ఆధారాలను సమర్పించాలని వైద్యారోగ్యశాఖ స్పష్టం చేసింది. ఆరోగ్యశ్రీ కింద నమోదుకానీ ఆస్పత్రులు గతంలో ప్రభుత్వం సూచించిన ప్యాకేజీ ధరలకు అదనంగా అందించే చికిత్సను అనుసరించి ఛార్జీలు వసూలు చేసుకోవచ్చని సూచించింది.

ఆర్టీపీసీఆర్ పరీక్షలో నెగెటివ్ వచ్చినప్పటికీ.. ఛాతీ ఎక్స్ రే, సీటీ స్కాన్ లో ఉన్న మార్పులకు అనుగుణంగా కొవిడ్ పాజిటివ్ రోగిగానే గుర్తించి ఆస్పత్రుల్లో చేర్చుకోవాలని వైద్యారోగ్యశాఖ సూచనలు జారీ చేసింది. ఆరోగ్యశ్రీ కింద నమోదుకాని ఆస్పత్రులు కొవిడ్ చికిత్స కోసం రోగుల నుంచి ప్రభుత్వ సూచించిన ధరల కంటే అదనంగా వసూలు చేయకుండా.. చూడాలని జిల్లా వైద్యశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. గతంలో కొవిడ్ క్రిటికల్ కేర్ చికిత్సకు మందులు, పరీక్షలు, ఆహారం సహా రోజుకు రూ.5,480 నుంచి రూ.10,380 వరకూ ప్రభుత్వం అనుమతినిచ్చింది. కొవిడ్ నాన్ క్రిటికల్ కేర్ కు రోజుకు 3250 చొప్పున మాత్రమే వసూలు చేయాలని స్పష్టం చేసింది.

ఇదీ చదవండి :'కొవిడ్​ ఆస్పత్రుల సంఖ్య పెంచాలి.. ప్రజల్లో ధైర్యం నింపాలి'

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details