ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సూర్యలంక తీరంలో మిలిటరీ శిక్షణకు సర్కార్ అనుమతి

గుంటూరు జిల్లాలోని సూర్యలంక తీరంలో నవంబరు 23 నుంచి డిసెంబరు 4 వరకు మిలిటరీ శిక్షణా కార్యక్రమాలు జరగనున్నాయి. సముద్రం వైపు శతఘ్నులతో కాల్పుల శిక్షణకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. శిక్షణలో 6 నుంచి 8 యుద్ధవిమానాలు పాల్గొంటాయని ప్రభుత్వం వెల్లడించింది. ఈ క్రమంలో సూర్యలంక ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ పరిధిలో 100 కిలోమీటర్ల వరకు నిషేధిత జోన్‌గా ప్రకటించింది.

suryalanka beach
suryalanka beach

By

Published : Oct 12, 2020, 11:07 PM IST

గుంటూరు జిల్లా సూర్యలంక తీరంలో సైన్యం శిక్షణా కార్యక్రమాలకు అనుమతి ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది నవంబరు 23 తేదీ నుంచి డిసెంబరు 4 తేదీ వరకూ గుంటూరు జిల్లా సూర్యలంకలో మిలటరీ శిక్షణా కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు వెల్లడించింది. సముద్రం వైపునకు శతఘ్నులతో కాల్పుల శిక్షణకు అనుమతి మంజూరు చేస్తూ సాధారణ పరిపాలశాఖ కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ఆదేశాలు జారీ చేశారు.

సూర్యలంకలోని ఎయిర్​ఫోర్స్ స్టేషన్ సమీపంలో మిలటరీ శిక్షణా కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు వెల్లడించారు. శిక్షణలో భాగంగా 6 నుంచి 8 యుద్ధ విమానాలు పాల్గొంటాయని ప్రభుత్వం పేర్కొంది. ఈ క్రమంలో సూర్యలంక ఎయిర్ ఫోర్స్​ స్టేషన్ పరిధిలోని 100 కిలోమీటర్ల వరకూ నిషేధిత జోన్​గా నిబంధనలు అమల్లో ఉంటాయని.. రాకపోకలు, సముద్రంలో చేపలవేట నిషేధమని ప్రభుత్వం స్పష్టం చేసింది. అటు వాణిజ్య నౌకలకు కూడా ప్రత్యామ్నాయ మార్గాలను సూచించినట్టు తెలిపింది.

ABOUT THE AUTHOR

...view details