రాష్ట్రంలో సినిమా, టీవీ చిత్రీకరణలకు అనుమతి ఇస్తున్నట్లు రాష్ట్ర ఫిల్మ్, టీవీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ టి.విజయ్ కుమార్ రెడ్డి గురువారం ప్రకటించారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా షూటింగ్లకు అనుమతి మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ అయినట్టు ఆయన వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా ఘాటింగ్లకు అనుమతి ఇస్తున్నట్లు విజయ్ కుమార్ చెప్పారు.
రాష్ట్రంలో సినిమాల చిత్రీకరణలకు అనుమతి
రాష్ట్రంలో సినిమా, టీవీ కార్యక్రమాల చిత్రీకరణలకు అనుమతి ఇస్తూ ఏపీ ఫిల్మ్, టీవీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉత్తర్వులు జారీ చేసింది. ఘాటింగ్ సమయాల్లో సిబ్బంది అంతా కొవిడ్ నిబంధనలు తప్పక పాటించాలని సూచించింది.
shootings
సినిమా, టీవీ కార్యక్రమాల షూటింగ్ల సమయంలో సాంకేతిక సిబ్బంది అంతా మాస్కులు ధరించాలని, నటీ నటుల విషయంలో మినహాయింపులు ఉన్నట్టు ఆయన వెల్లడించారు. కరోనా వ్యాప్తి నియంత్రణకు ప్రేక్షకులు తీసుకోవాల్సిన జాగ్రత్తలతో కూడిన సందేశాన్ని చిత్ర ప్రదర్శన ప్రారంభ, విరామ సమయాల్లో ప్రదర్శించాలని సూచించింది.