రాష్ట్ర పరిధిలో ప్రజారవాణా వాహనాలకు ప్రభుత్వం లాక్డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చింది. ఆటోలు, కార్లు, ఇతర ప్రైవేటు వాహనాలకు అనుమతి ఇస్తున్నట్లు కొవిడ్ టాస్క్ఫోర్స్ కమిటీ ఛైర్మన్ కృష్ణబాబు వెల్లడించారు. కంటైన్మెంట్ జోన్లకు మాత్రం ఈ మినహాయింపు వర్తించదని తెలిపారు. కరోనా నిబంధనలు పాటిస్తూ ప్రయాణాలు చేయాలని స్పష్టం చేశారు. ఆటోల్లో డ్రైవర్ సహా ముగ్గురు, కారులో డ్రైవర్ సహా నలుగురు మాత్రమే ప్రయాణించాలని చెప్పారు. ఇతర ప్రైవేటు వాహనాల్లో 50 శాతం సీట్లలో ప్రయాణానికి అనుమతి ఇచ్చారు.
ప్రజా రవాణా వాహనాలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి - ఏపీలో ప్రజా రవాణా వార్తలు
ap government gave lockdown exemption for public transfort vechiles
Last Updated : May 29, 2020, 9:14 PM IST