ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బల్క్ డ్రగ్ పార్కు అభివృద్ధి భాగస్వామి ఎంపికకు కమిటీ - ap bulk drug park latest news

రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న బల్క్ డ్రగ్ పార్కు అభివృద్ధికి భాగస్వామి ఎంపిక కోసం ప్రభుత్వం హైపవర్ కమిటీ ఏర్పాటు చేసింది. కమిటీ ఛైర్మన్​గా సీసీఎల్​ఏ కమిషనర్, కన్వీనర్​గా బల్క్ డ్రగ్ ఇన్​ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఎండీని నియమించింది.

ap government
ap government

By

Published : Sep 21, 2020, 5:11 PM IST

ఏపీ బల్క్ డ్రగ్ పార్కు అభివృద్ధికి భాగస్వామి ఎంపికకు హైపవర్ కమిటీని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ కమిటీలో ఎనిమిది మంది సభ్యులు ఉంటారని పేర్కొంది. కమిటీ ఛైర్మన్​గా సీసీఎల్​ఏ కమిషనర్, కన్వీనర్​గా బల్క్ డ్రగ్ ఇన్​ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఎండీని నియమించింది. హైపవర్ కమిటీలో సభ్యులుగా వివిధ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు ఉంటారు. మరోవైపు బల్క్ డ్రగ్ పార్కు ఏర్పాటు కోసం ప్రైవేట్ సంస్థలు బిడ్డింగ్​లో పాల్గొనేందుకు ఇప్పటికే ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది.

ABOUT THE AUTHOR

...view details