ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆ ప్రాజెక్టులకు రివర్స్ టెండరింగ్​ నుంచి మినహాయింపు - రివర్స్ టెండరింగ్ వార్తలు

పట్టణాల్లో నీటిసరఫరా, డ్రైనేజ్ ప్రాజెక్టులకు రివర్స్ టెండరింగ్​, జ్యుడీషియల్ ప్రివ్యూ నుంచి రాష్ట్ర ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. కొత్త విధానం ప్రకారం ప్రాజెక్టు అమలు చేయడానికి ఏఐఐ బ్యాంకు నిరాకరించటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

ap government
ap government

By

Published : Oct 26, 2020, 6:49 PM IST

పట్టణాల్లో నీటిసరఫరా, డ్రైనేజ్ ప్రాజెక్టులకు రివర్స్ టెండరింగ్​, జ్యుడీషియల్ ప్రివ్యూ నుంచి రాష్ట్ర ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. ప్రాజెక్టు అమలుకు 2019లో ఏఐఐ బ్యాంకు, రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఒప్పందం జరిగింది. కొత్త విధానం ప్రకారం ప్రాజెక్టు అమలు చేయడానికి ఏఐఐ బ్యాంకు నిరాకరించింది. పాత నిబంధనల ప్రకారమే ముందుకెళ్లాలని బ్యాంకు సూచించింది.

ఈ క్రమంలో ఆ ప్రాజెక్టులకు రివర్స్ టెండరింగ్​, జ్యుడీషియల్ ప్రివ్యూ నుంచి మినహాయింపు ఇస్తూ పురపాలకశాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ఏఐఐ బ్యాంకు నిధులు 5,350 కోట్ల రూపాయలతో ప్రాజెక్టుకు పాలనా అనుమతులు ఇచ్చింది.

ABOUT THE AUTHOR

...view details