బదిలీలు, నియామకాల పాలసీపై మరింత అధ్యయనం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా బదిలీలు, నియామకాల విధానం పునః సమీక్షకు ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
బదిలీలు, నియామకాల విధానం పునః సమీక్షకు కమిటీ - reconsideration of the recruitment policy in ap
పారదర్శకతతో బదిలీలు, నియామకాలు జరిగేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. బదిలీలు, నియామకాల విధానం పునః సమీక్షకు ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీ ఏర్పాటు చేసింది.
ap government
కమిటీ ఛైర్‌పర్సన్‌గా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నీని నియమించింది. కమిటీ సభ్యులుగా సీసీఎల్ఏ, డీజీపీ, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి, జీఏడీ కార్యదర్శి ఉంటారు. 14 రోజుల్లో బదిలీలు, నియామకాల పాలసీ పునః సమీక్షపై నివేదిక ఇవ్వాలని కమిటీని ప్రభుత్వం ఆదేశించింది.