ఎన్నికల విధుల్లో పాల్గొనమని తాము ఎన్నడూ చెప్పలేదని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య ఛైర్మన్ వెంకటరామిరెడ్డి అన్నారు. ఆరోగ్యం సరిగ్గాలేని ఉద్యోగులను మినహాయించి మిగిలిన వారితో ఎన్నికలు నిర్వహించుకోవచ్చని చెప్పామని స్పష్టం చేశారు. వాక్సినేషన్ ఇచ్చాక ఉద్యోగులందరు ఎన్నికల విధుల్లో పాల్గొనే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఎన్నికల విధులకు సహకరించే వారితో నిర్వహించుకోవచ్చని ఆయన తెలిపారు. వ్యాక్సినేషన్ పూర్తయ్యే వరకు గోవాలో స్థానిక ఎన్నికలు వాయిదా వేశారని.. ఇక్కడ కూడా అదే మానవతా దృక్పథంతో నిర్ణయం తీసుకోవాలని వెంకట్రామిరెడ్డి కోరారు
ఎన్నికల విధుల్లో పాల్గొనమని ఎన్నడూ అనలేదు: ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య ఛైర్మన్
ఎన్నికల విధుల్లో పాల్గొనబోమని తాము చెప్పలేదని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య ఛైర్మన్ వెంకటరామిరెడ్డి అన్నారు. వాక్సినేషన్ ఇచ్చాక ఉద్యోగులందరు ఎన్నికల విధుల్లో పాల్గొనే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య ఛైర్మన్