ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'మన బడి, నాడు - నేడు టెండర్ల అంచనాకు కమిటీ ఏర్పాటు' - high level committe for mana badi

రాష్ట్రంలో మన బడి, నాడు - నేడు కార్యక్రమం కింద చేపట్టే పనులకు సంబంధించిన టెండర్లను అంచనా వేసి ఆమోదించేందుకు ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని నియమించింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఫర్నీచర్, టాయిలెట్ ఉపకరణాలు, గ్రీన్ చాక్ బోర్డులను సేకరించడానికి పిలిచే టెండర్లను ఆమోదించే బాధ్యతను సర్కారు కమిటీకి అప్పగించింది.

'మన బడి, నాడు - నేడు టెండర్ల అంచనాకు కమిటీ ఏర్పాటు'
'మన బడి, నాడు - నేడు టెండర్ల అంచనాకు కమిటీ ఏర్పాటు'

By

Published : Dec 25, 2019, 4:38 AM IST


రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాల కల్పన కోసం ప్రభుత్వం చేపట్టిన మన బడి, నాడు నేడు కార్యక్రమం కింద చేపట్టే పనుల టెండర్ పత్రాలను సిద్ధం చేయడానికి, టెండర్లు అంచనా వేయడం, ఆమోదించేందుకు ఉన్నత స్థాయి కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 11 మందితో కూడిన ఉన్నత స్థాయి కమిటీకి పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ఛైర్మన్​గా.. పాఠశాల విద్యా శాఖ కమిషనర్ కన్వీనర్​గా వ్యవహరిస్తారు.

కమిటీలో సభ్యులు వీళ్లే

ఈ కమిటీలో పాఠశాల విద్యాశాఖ సలహాదారు, ఎపిఎస్ఎస్ స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్, ఏపీఈడబ్ల్యూఐడీసీ ఎండీ, పంచాయతీ రాజ్ ఇంజినీర్ ఇన్ చీఫ్, గిరిజన సంక్షేమం, పబ్లిక్ హెల్త్ ఇంజినీర్ ఇన్ చీఫ్, ఏపీఎస్ఎస్ చీఫ్ ఇంజినీర్, ఆర్థిక శాఖ నుంచి డిప్యూటీ, జాయింట్, ప్రభుత్వ అదనపు కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు. పాఠశాలల్లో ఫర్నీచర్, టాయిలెట్ ఉపకరణాలు, గ్రీన్ చాక్ బోర్డులను సేకరించడానికి టెండర్లను పిలువనున్నారు. వీటిని పరిశీలించి ఆమోదించే బాధ్యతను ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీకి అప్పగించింది. ఈ మేరకు తగు చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యా శాఖ కమిషనర్, సమగ్ర శిక్ష ప్రాజెక్టు డైరెక్టర్లను సర్కారు ఆదేశించింది.

ఇదీ చూడండి:

'రాష్ట్రాభివృద్ధికి చేయాల్సింది ఎప్పుడూ చేస్తూనే ఉంటా'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details