కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం అమల్లోకి వచ్చి నేటికీ 16 సంవత్సరాలు పూర్తయిందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు సూర్యనారాయణ అన్నారు. సీపీఎస్ విధానం ఉద్యోగుల పాలిట శాపంగా మారిందన్నారు. పెన్షన్ అనేది ఉద్యోగుల హక్కు అని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంకల్పయాత్రలో భాగంగా ఇచ్చిన హామీ, సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు. రిటైర్మెంట్ సమయంలో పెన్షన్ ఉద్యోగులకు భరోసానిస్తుందని... సీపీఎస్ విధానం వల్ల తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. రాబోయే దసరాలోగా సీపీఎస్ రద్దు చేసి ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపాలని కోరారు.
'సీపీఎస్ విధానం ఉద్యోగుల పాలిట శాపం' - ap governament employees on cps
సీపీఎస్ విధానం ఉద్యోగుల పాలిట శాపంగా మారిందని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. సీపీఎస్ విధానం వల్ల ఉద్యోగులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. సీఎం జగన్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరారు.
ap governament employees