మీరు నిత్యావసర వస్తువులు తీసుకోవడంలో ఇబ్బందులు పడుతున్నారా... వ్యాపారులు రేట్లు పెంచి దోపిడీ చేస్తున్నారా... లేదా మరేదైనా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారా... ఓ ఫోన్ కాల్ మీ సమస్యలను పరిష్కరిస్తుంది. కేవలం రెండు గంటల వ్యవధిలోనే మీ సమస్యలకు అధికారులు పరిష్కారం చూపుతారు. ఈ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఓ కాల్ సెంటర్ను ఏర్పాటు చేసింది. విజయవాడ కేంద్రంగా కమాండ్ కంట్రోల్ సిద్ధం చేసి నిరంతరం పర్యవేక్షిస్తోంది. సమస్యల పరిష్కారానికి 1902కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చని తెలిపింది. ఈ అవకాశాన్ని ప్రజలంతా వినియోగించుకోవాలని ఈ వ్యవస్థను పర్యవేక్షిస్తోన్న సీనియర్ ఐఏఎస్ అధికారి హిమాన్షు శుక్లా ప్రజలను కోరారు. మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే..!
'సమస్యలుంటే ఈ నెంబరుకు ఫిర్యాదు చేయవచ్చు'
లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలు నిత్యావసరాల కోసం క్యూ కడుతున్నారు. వీరి అవసరాన్ని ఆసరాగా చేసుకున్న కొందరు వ్యాపారులు అమాంతం రేట్లు పెంచేస్తున్నారు. అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. వీటన్నింటికీ ఇక ఓ ఫోన్ కాల్ చెక్ పెట్టనుంది. వ్యాపారులు అధిక ధరలకు అమ్మినా, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నా ఈ నంబరుకు ఇకపై ఫిర్యాదు చేయవచ్చు.
'సమస్యలుంటే ఈ నెంబరుకు ఫిర్యాదు చేయవచ్చు'
TAGGED:
1092 call center news