ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ప్రభుత్వ మార్గదర్శకాలు పాటించండి.. కరోనాను అరికట్టండి' - ap governor cooments on corona issue

కరోనా వైరస్​ ప్రబలుతున్న ప్రస్తుత తరుణంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గవర్నర్​ బిశ్వభూషణ్​ హరిచందన్​ సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాలు పాటించి వైరస్​ వ్యాప్తిని అడ్డుకోవాలన్నారు. దాతలు, ప్రజలు కరోనా సహాయ చర్యల కోసం విరివిగా విరాళాలివ్వాలని పిలుపునిచ్చారు. లాక్​డౌన్​ నేపథ్యంలో స్వచ్ఛంద సంస్థలు పేదలు, కూలీలకు ఉచితంగా ఆహారం సమకూర్చాలని అన్నారు.

'ప్రభుత్వ మార్గదర్శకాలు పాటించి.. కరోనాను అరికట్టాలి'
'ప్రభుత్వ మార్గదర్శకాలు పాటించి.. కరోనాను అరికట్టాలి'

By

Published : Mar 30, 2020, 6:31 PM IST

ప్రధాని కేర్స్‌ నిధికి గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ నెల జీతం విరాళం ఇచ్చారు. సీఎం సహాయ నిధికి కరోనా సహాయ చర్యల కోసం రూ.లక్ష విరాళం ప్రకటించారు. ప్రజలు, దాతలు ఉదారంగా విరాళాలు అందించి కరోనా వ్యాప్తి నివారణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రమాదకరంగా పరిణమించిన కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధానికి ప్రజలంతా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన మార్గదర్శకాలను పాటించాలని సూచించారు. సామాజిక దూరాన్ని పాటిస్తూ.. స్వీయ నిర్బంధంలో క్రమశిక్షణతో మెలగాలని చెప్పారు. విదేశీ ప్రయాణికులు స్వచ్ఛందంగా ఆరోగ్య పరీక్షలకు ముందుకు రావాలని కోరారు. వృద్ధులు, పిల్లలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

సహాయం అందించాలి

ఎన్​సీసీ, ఎన్​ఎస్​ఎస్​, రెడ్‌క్రాస్‌, ఎన్జీఓలు, పౌరసమాజం సభ్యులు, యువజన సంస్థలు కరోనా వైరస్​పై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. లాక్​డౌన్​ నేపథ్యంలో నిరుపేదలు, కూలీలు, వలస కార్మికులు ఇబ్బందులు పడుతున్నందున వారికి అవసరమైన సామగ్రి ఉచితంగా పంపిణీ చేయాల్సిందిగా రెడ్​క్రాస్​ సొసైటీ అధికారులకు సూచించినట్లు గవర్నర్​ తెలిపారు.

ఇదీ చూడండి:

'ప్రతి జిల్లాలో 5 వేల బెడ్స్​తో ఐసోలేషన్, క్వారంటైన్ కేంద్రాలు'

ABOUT THE AUTHOR

...view details