ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పంటను ముంచేసిన మిగ్​జాం తుపాను - రైతన్న వెన్ను విరిచిన జగన్ ప్రభుత్వం - ap latest news

AP Farmers Angry on E Crop System: తుపాను కారణంగా పంట నష్టపోయిన రైతులకు పరిహారం రాదని ఆర్బీకే అధికారులు తేల్చి చెప్పారు. దీంతో కృష్ణా జిల్లాలో రైతన్నలు తీవ్ర నిరాశలో ఉన్నారు. అసలు విషయం ఏంటంటే?

AP_Farmers_Angry_on_E_Crop_System
AP_Farmers_Angry_on_E_Crop_System

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 15, 2023, 4:48 PM IST

AP Farmers Angry on E Crop System: వైఎస్సార్సీపీ ప్రభుత్వ 'ఈ క్రాప్' విధానం రైతన్నల నడ్డివిరిచింది. తుపాను ప్రభావంతో పంట నష్టపోయిన రైతులకు ఈ క్రాప్ నమోదు చేయని కారణంగా పరిహారం అందదని చెప్పటంతో తీవ్ర నిరాశలో ఉన్నారు.

కృష్ణాజిల్లాలోని మోపిదేవి మండలం నాగాయతిప్ప గ్రామంలో మిగ్​జాం తుపాను ప్రభావంతో ఈదురు గాలులతో కూడిన వర్షాల కారణంగా అరటి తోటలు నెలకొరిగాయి. అయితే రైతులు 'ఈ క్రాప్'​లో పంట నమోదు చేయకపోవటంతో పరిహారం రాదని రైతు భరోసా కేంద్రంలోని అధికారులు తెలిపారు. దీంతో రైతన్నలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

తుపాను ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన-నష్టపోయిన ప్రతి రైతుని ఆదుకుంటామని స్పష్టం

వైఎస్సార్సీపీ ప్రభుత్వం రైతన్నల సంక్షేమం కోసం అంటూ రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటుచేసి సిబ్బందిని నియమించారు. ఆర్బీకే అధికారులకు ప్రతి రైతు వేసిన పంటను నమోదు చేయాలని ప్రభుత్వం ఎన్నో సార్లు ఆదేశాలు జారీ చేసి గడువు కూడా పొడిగించింది. అయితే 100 శాతం 'ఈ క్రాప్' నమోదు చేయడంలో సిబ్బంది నిర్లక్ష్యం వహించడం తుపానుకు భారీగా పంట నష్టపోయిన రైతులకు శాపంగా మారింది.

పొలాల వద్దకు వెళ్లి, రైతు ఏ పంట సాగుచేస్తున్నాడో పరిశీలించాల్సిన బాధ్యత ఆర్బీకే అధికారులపై ఉంది. అయితే అధికారులు అవేం పట్టించుకోకుండా పాస్ పుస్తకం, ఆధార్ కార్డు, బ్యాంకు పుస్తకం, వన్​ బీ వంటి పత్రాల జిరాక్స్​లు ఇవ్వాలంటూ ప్రతి సంవత్సరం ఒక్కో రైతుకు రూ.100 వరకు అదనపు భారం కలిగిస్తున్నారు. ఒకసారి ఇచ్చిన జిరాక్స్​లు తమ కార్యాలయంలో ఉన్నప్పటికీ ప్రతి పంటకు జిరాక్స్​లు ఇవ్వాలని రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు.

కేంద్ర బృందానికి షాక్ ఇచ్చిన రాష్ట్ర అధికారులు- పాత తేదీల ఫోటోలు పెట్టడాన్ని తప్పుపట్టిన బృందం సభ్యులు

రైతులు 'ఈ క్రాప్' నమోదు చేయమంటే చేస్తామని ఆర్బీకే అధికారులు చెప్పటం, పంట నష్టపోయిన సమయంలో నమోదు కాలేదని చెప్పటం దారుణమని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేవలం వైఎస్సార్సీపీ నేతల పొలాలకు మాత్రమే 'ఈ క్రాప్' నమోదు చేశారని రైతన్నలు ఆరోపించారు. సన్న, చిన్నకారు రైతుల పంటలు నమోదు చేయడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతోపాటు కౌలు కార్డులు మంజూరు చేసినా ఆర్బీకే అధికారులు 'ఈ క్రాప్' నమోదు చేయలేదని, దీనివల్ల తాము మరింత నష్టపోయామని కౌలు రైతులు వాపోయారు.

పంట నష్టపోయిన ప్రతి రైతుకు న్యాయం చేస్తామని సీఎం చెప్పినా క్షేత్ర స్థాయిలో పరిస్థితి మరోలా ఉందని అంటున్నారు. నష్టపోయిన పంటలను చూసేందుకు ఇప్పటివరకు స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే కూడా రాలేదని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్రంగా నష్టపోయిన తమకు పరిహారం అందించి ప్రభుత్వమే ఆదుకోవాలని రైతన్నలు వేడుకుంటున్నారు.

నీళ్లలో వరి పంట - అద్దె పడవ ద్వారా తరలిస్తున్న రైతులు

ABOUT THE AUTHOR

...view details