ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణా మండలి(ఈఆర్సీ) ప్రధాన కార్యాలయాన్ని ఏపీ భూభాగంలోకి మారుస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పటినుంచి...ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో ఏపీ ఈఆర్సీ ప్రధాన కార్యాలయంగా ఉంటుందని ప్రభుత్వం ఈ నోటిఫికేషన్లో పేర్కొంది. ఇప్పటివరకు హైదరాబాద్లో కొనసాగిన ఏపీ ఈఆర్సీ ప్రధాన కార్యాలయాన్ని...అమరావతి ప్రాంతంలో ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఈ ప్రకటన జారీ చేసింది. విద్యుత్ నియంత్రణ మండలి కార్యాలయాన్ని తక్షణమే మార్పు చేస్తూ ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ ఆదేశాలు జారీ చేశారు.
అమరావతికి ఏపీఈఆర్‌సీ ప్రధాన కార్యాలయం - AP Erc operations
ఏపీ ఈఆర్సీ ప్రధాన కార్యాలయాన్ని హైదరాబాద్ నుంచి రాష్ట్ర రాజధాని ప్రాంతానికి మారుస్తూ ఇంధనశాఖ కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు. ఇక నుంచి అమరావతి నుంచి కార్యకలాపాలు జరుగుతాయని నోటిఫికేషన్లో ప్రకటించారు.
![అమరావతికి ఏపీఈఆర్‌సీ ప్రధాన కార్యాలయం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3986372-402-3986372-1564468423748.jpg)
అమరావతిలో ఏపీ ఈఆర్సీ ప్రధాన కార్యాలయం
రాష్ట్ర భూభాగంలోనే...ఈఆర్సీ ప్రధాన కార్యాలయం
ఇదీ చదవండి :గురుకుల విద్యార్థినిలు..సృజనాత్మకతలో అగ్రగణ్యులు