Electricity Workers Strike : సమస్యలు పరిష్కరించకపోతే ఇవాళ అర్ధరాత్రి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకు దిగుతామని విద్యుత్ ఉద్యోగులు స్పష్టం చేసిన దృష్ట్యా... సమ్మె నివారణపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఉద్యోగుల డిమాండ్లు, సమ్మె నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దృష్టి సారించారు. ఈ మేరకు తాడేపల్లి లోని క్యాంపు కార్యాలయంలో విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి, మంత్రి బొత్స సత్యనారాయణ, విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో సీఎం సమావేశమయ్యారు. ఇప్పటికే 12 ప్రధాన డిమాండ్స్ తో విద్యుత్ ఉద్యోగుల జేఏసీ సమ్మె నోటీసు ఇచ్చింది. వీటిలోని ఉద్యోగుల ప్రధాన డిమాండ్ల పరిష్కారంపై అధికారులతో సమగ్రంగా సీఎం చర్చించి తగిన మార్గదర్శకాలు జారీ చేశారు. అందులో భాగంగా బుధవారం సాయంత్రం 4 గంటలకు విద్యుత్ ఉద్యోగుల జేఏసీ నేతలను మరో సారి చర్చలకు పిలిచి చర్చించాలని సీఎం ఆదేశించారు. పలు డిమాండ్ల(Demands) పరిష్కారంపై చర్చించి తగిన సానుకూల నిర్ణయం తీసుకోవాలని సూచించారు.
Prathidwani: డిమాండ్ల సాధనకు విద్యుత్ ఉద్యోగుల పోరుబాట
Power Minister Peddireddyసీఎం ఆదేశాలతో సాయంత్రం 4 గంటలకు విద్యుత్ ఉద్యోగుల సమస్యలపై ఏర్పాటైన మంత్రుల సబ్ కమిటీ, ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలతో చర్చలు జరుపుతుందని సమావేశం అనంతరం మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. సమ్మె నోటీసు లోని పలు డిమాండ్ల పరిష్కారంపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని, విద్యుత్ ఉద్యోగులు సమ్మెకు వెళ్లే ఆస్కారం లేదని మంత్రి చెప్పారు. విద్యుత్ ఉద్యోగుల డిమాండ్లపై సీఎంతో చర్చించామని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు.
Sub-committee deliberations.. సచివాలయంలో విద్యుత్ ఉద్యోగుల జేఏసీతో సబ్ కమిటీ చర్చలు జరుపుతోంది. మంత్రులు పెద్దిరెడ్డి, బొత్స, సీఎస్ జవహర్ రెడ్డి, ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్ హాజరయ్యారు. విద్యుత్ ఉద్యోగుల ఆందోళనలపై సీఎంతో ఇవాళ ఉదయం చర్చించిన సబ్ కమిటీ.. వేతన సవరణ, వన్‌మ్యాన్ కమిటీ నివేదికపై విద్యుత్ ఉద్యోగుల జేఏసీతో చర్చిస్తోంది.
electricity workers Demandsవిద్యుత్ ఉద్యోగ జేఏసీ(Electricity Employees JAC)సమ్మె పిలుపు మేరకు... విద్యుత్ ఉద్యోగులు బుధవారం అర్ధరాత్రి నుంచి రాష్ట్రవ్యాప్తంగా సమ్మెకు సమాయత్తమయ్యారు. డిమాండ్ల సాధన కోసం నిరవధిక సమ్మెకువిద్యుత్ ఉద్యోగుల జేఏసీపిలుపు నివ్వగా.. ఇప్పటికే 12 డిమాండ్లతో ప్రభుత్వానికి నోటీసు అందజేసింది. కాగా, సీఎండీ, ఉన్నతాధికారులు.. ఉద్యోగులతో పలు దఫాలు చర్చలు జరిపినా.. పీఆర్సీ సహా ప్రధాన డిమాండ్ల పరిష్కారంపై హామీ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో సమస్యల పరిష్కారానికి బుధవారం రాత్రి వరకు సమయమిచ్చిన విద్యుత్ ఉద్యోగుల జేఏసీ నేతలు.. సమస్యలు పరిష్కరించకపోతే అర్ధరాత్రి నుంచి సమ్మెకు దిగుతామన్న స్పష్టం చేశారు.