ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 3, 2020, 2:47 PM IST

Updated : Apr 3, 2020, 3:08 PM IST

ETV Bharat / state

కరోనాపై వదంతులు ప్రచారం చేస్తే కఠిన చర్యలు: డీజీపీ

రాష్ట్రంలో పోలీసు శాఖ.. వివిధ శాఖల సమన్వయంతో సమర్థంగా పనిచేస్తున్నట్లు డీజీపీ గౌతమ్​ సవాంగ్​ తెలిపారు. కరోనాపై ఎవరైనా వదంతులు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వివిధ సరిహద్దు చెక్​పోస్టుల వద్ద సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించిన ఆయన.. వారికి లాక్​డౌన్​పై పలు సూచనలు చేశారు. ఎలాంటి ఫిర్యాదులు రాకుండా పని చేయాలని దిశా నిర్దేశం చేశారు.

కరోనాపై వదంతులు ప్రచారం చేస్తే కఠిన చర్యలు: డీజీపీ
కరోనాపై వదంతులు ప్రచారం చేస్తే కఠిన చర్యలు: డీజీపీ

కరోనాపై వందతులు వద్దన్న డీజీపీ

కరోనాపై సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర డీజీపీ గౌతమ్​ సవాంగ్​ హెచ్చరించారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలోని గరికపాడు చెక్​పోస్టును పరిశీలించిన ఆయన.. వదంతులు ప్రచారం చేయవద్దని ప్రజలకు హితవు పలికారు. కరోనా బాధితుల విషయంలో పోలీసులు అత్యంత విస్తృతంగా పనిచేస్తున్నారన్న ఆయన.. అన్ని శాఖలతో సమన్వయంగా పోలీసు శాఖ పనిచేస్తోందని చెప్పారు. ప్రజలు సైతం మంచి స్ఫూర్తితో పోలీసులకు సహకరిస్తున్నట్లు చెప్పారు.

సరిహద్దు సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్​

చెక్​పోస్టు సిబ్బందితో డీజీపీ వీడియో కాన్ఫరెన్స్​

కృష్ణా జిల్లా గరికపాడు చెక్​పోస్ట్​ వద్ద భద్రతను డీజీపీ గౌతమ్​ సవాంగ్​ పరిశీలించారు. ఈ సందర్బంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సరిహద్దు చెక్ పోస్టుల వద్ద పరిస్థితులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తెలుసుకున్నారు. శ్రీకాకుళం, నాగార్జున సాగర్, విజయనగరం సాలూరు చెక్ పోస్ట్ సిబ్బందితో మాట్లాడారు. కేవలం అత్యవసర వస్తువుల రాకపోకలు ఉన్న వాహనాలను మాత్రమే అనుమతిస్తున్నట్లు అధికారులు ఆయనకు వివరించారు. ఉచిత భోజనం పంపిణీ గురించి హైవేలపై వెళ్తున్న వాహనాలకు సమాచారం ఇస్తున్నారా అని సిబ్బందిని డీజీపీ ప్రశ్నించారు. సరుకులు వెళ్లే వాహనాలను ఆపుతున్నారనే ఫిర్యాదులు రాకుండా పని చేయాలని సిబ్బందికి సవాంగ్​ సూచించారు.

ఇదీ చూడండి:

'రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా రేషన్‌'

Last Updated : Apr 3, 2020, 3:08 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details