ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'లాక్​డౌన్​ అమలవుతున్నా నిత్యావసరాలకు కొరత రాదు' - ap cs comments on lock down situation

రాష్ట్రంలో నిత్యావసరాలకు ఎలాంటి ఇబ్బంది రాదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని తెలిపారు. ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు.

'లాక్​డౌన్​ అమలవుతున్నా నిత్యావసరాలకు కొరత రాదు'
'లాక్​డౌన్​ అమలవుతున్నా నిత్యావసరాలకు కొరత రాదు'

By

Published : Mar 25, 2020, 4:53 AM IST

దేశ వ్యాప్తంగా లాక్​డౌన్​ అమలవుతున్నప్పటికీ నిత్యావసర వస్తువుల సరఫరాకు ఎలాంటి ఇబ్బంది రాదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని స్పష్టం చేశారు. జనతా కర్ఫ్యూ తర్వాత రెండు రోజులు అందుబాటులో ఉన్నట్లుగానే ఇకముందు కూడా జరుగుతుందని ఆమె తెలిపారు. నిత్యావసరాలు కొరత వస్తుందని ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆమె స్పష్టం చేశారు. కరోనాపై అందరూ అప్రమత్తంగా ఉండాలని.. ముఖ్యంగా స్వీయ నియంత్రణ పాటించాలని నీలం సాహ్నిసూచించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details