రాష్ట్రంలో కొత్తగా 23,920 కరోనా కేసులు, 83 మరణాలు నమోదయ్యాయి. 24 గంటల వ్యవధిలో లక్షా 14 వేల 299 పరీక్షలు నిర్వహించారు. కరోనా నుంచి మరో 11 వేల 411 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,43,178 యాక్టివ్ కేసులున్నాయి.
కరోనాతో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 12 మంది మృతిచెందగా.. విశాఖ, అనంతపురం, కృష్ణాలో 8 మంది మృత్యువాత పడ్డారు. మహమ్మారితో విజయనగరం, ప్రకాశం జిల్లాల్లో ఏడుగురు చొప్పున మృతి చెందారు. చిత్తూరు, నెల్లూరు, శ్రీకాకుళం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఆరుగురు చొప్పున మరణించారు. వైరస్ బారినపడి గుంటూరు జిల్లాలో 5, కర్నూలు జిల్లాలో నలుగురు కన్నుమూశారు.
జిల్లాల వారీగా..
చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 2,945 కరోనా కేసులు నమోదు కాగా తూర్పు గోదావరి జిల్లాలో 2,831, శ్రీకాకుళంలో 2,724 కేసులను గుర్తించినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. కర్నూలు జిల్లాలో 2,516, గుంటూరు జిల్లాలో 2,384 కేసులు, పశ్చిమ గోదావరి జిల్లాలో 1,977, విశాఖలో 1,938 కొవిడ్ కేసులు నిర్థారణ అయినట్లు తెలిపింది. ప్రకాశం జిల్లాలో 1,378, అనంతపురం జిల్లాలో 1,303 కరోనా కేసులు నమోదైనట్లు స్పష్టం చేసింది. కడప జిల్లాలో 1,055, నెల్లూరు 1,011, కృష్ణా 989, విజయనగరం జిల్లాలో 849 వైరస్ కేసులను గుర్తించినట్లు వివరించింది.
ఇవీ చూడండి :ఎగ్జిట్ పోల్స్‌కు, ఎగ్జాట్ పోల్స్‌కు పెద్దగా తేడా లేదు: రఘురామ