కాంగ్రెస్ పార్టీని విమర్శించే స్థాయి వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డికి లేదని ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్, వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి మండిపడ్డారు. రాజ్యసభలో వ్యవసాయ బిల్లులపై చర్చలో కాంగ్రెస్‌ను విజయసాయిరెడ్డి విమర్శించడాన్ని వారు తప్పుబట్టారు. కేసుల నుంచి తప్పించుకునేందుకు భాజపాకు తాబేదారులా విజయసాయి ప్రవర్తిస్తున్నారని ఘాటు విమర్శలు చేశారు. కాంగ్రెస్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
'ఎంపీ విజయసాయిరెడ్డి క్షమాపణలు చెప్పాలి' - కాంగ్రెస్‌పై ఎంపీ విజయసాయి వ్యాఖ్యలు
వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డిపై ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్, వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్‌ను విమర్శించే స్థాయి ఆయనకు లేదన్నారు. పార్టీపై ఆయన చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ap congress leaders
మరోవైపు వైకాపా, తెదేపాలు పోటీపడి రైతు వ్యతిరేక బిల్లులకు మద్దతిచ్చాయని శైలజానాథ్, తులసిరెడ్డి విమర్శించారు. వైకాపా 15 నెలల పాలనలో అనేక రైతు వ్యతిరేక నిర్ణయాలు తీసుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ సరఫరా పథకాన్ని ఎత్తివేయాలని చూస్తోందని ఆరోపించారు.