ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'సమస్యలు పరిష్కరిస్తేనే సినిమా హాళ్లు తెరుస్తాం' - సినిమా హాళ్లపై వార్తలు

రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించేవరకూ సినిమా హాళ్లు తెరవబోమని ఎగ్జిబిటర్లు తేల్చి చెప్పారు. విజయవాడ తెలుగు ఫిలిం ఛాంబర్ కార్యాలయంలో రాష్ట్ర స్థాయి ఎగ్జిబిటర్లు సమావేశమయ్యారు.

ap cinema exhibitors on opening on cinema theatres
ఎగ్జిబిటర్లు

By

Published : Oct 14, 2020, 5:22 PM IST

థియేటర్లకు ఫిక్స్‌డ్ విద్యుత్ ఛార్జీలు రద్దు చేసి.. ఇతర రాయితీలు ప్రభుత్వం కల్పించే వరకూ సినిమా హాళ్లను తెరవలేమని ఎగ్జిబిటర్లు తేల్చి చెప్పారు. విజయవాడ తెలుగు ఫిలిం ఛాంబర్ కార్యాలయంలో జరిగిన రాష్ట్ర స్థాయి ఎగ్జిబిటర్ల సమావేశంలో 13 జిల్లాల ప్రతినిధులు పాల్గొన్నారు. అక్టోబర్ 15 నుంచి థియేటర్లు తెరిచే వెసులు బాటు కేంద్రం కల్పించినా రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించేవరకూ సినిమా హాళ్ళు తెరవకూడదని నిర్ణయించామని తెలిపారు.

ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమా హాళ్లు నడవాలంటే ఒక్కో దానికి దాదాపు రూ. 10 లక్షలు అదనపు ఖర్చు అవుతుందని వెల్లడించారు. కేంద్రం ఇచ్చిన 24 నిబంధనల ప్రకారం థియేటర్లు నడపాలంటే ఒక్కో ప్రేక్షకుడిపై రూ.25 అదనపు భారం పడనుందని వివరించారు. వీటన్నిటికి తోడు 50% ఆక్యుపెన్సీతో సినిమా హాళ్ల నిర్వహణ కష్టతరమని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సినిమా పెద్దలకు ఇచ్చిన హామీలు అమల్లోకి వస్తేనే థియేటర్లు పున:ప్రారంభించగలమని తెల్చిచెప్పారు.

ABOUT THE AUTHOR

...view details