కృష్ణా జిల్లా మోపిదేవిలో శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని.. కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. మొదటగా ఆలయ అర్చకులు సీఎస్‌కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామి వారి సన్నిధిలోని నాగేంద్ర స్వామి పుట్టలో పాలు పోసి... ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి జీవీడీఎన్ లీల కుమార్... ఆమెకు స్వామి చిత్రపటం, తీర్థ ప్రసాదాలు అందజేశారు.
మోపిదేవి ఆలయాన్ని సందర్శించిన సీఎస్ నీలం సాహ్ని - cs neelam sahnni in krsihns mopidevi temple
కృష్ణా జిల్లా మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని సీఎస్ నీలం సాహ్ని... కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. ప్రత్యేక పూజల అనంతరం స్వామి వారి చిత్రపటం, తీర్థ ప్రసాదాన్ని అధికారులు ఆమెకు అందజేశారు.
మోపిదేవి ఆలయాన్ని సందర్శించిన సీఎస్ నీలం సాహ్ని