ఈ నెల 15న రాష్ట్ర మంత్రి వర్గం సమావేశం కానుంది. ఆ రోజున ఉదయం 11 గంటలకు సచివాలయం ఒకటో బ్లాక్లో మంత్రి వర్గ భేటీ జరగనుంది. దీనిలో పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనుంది.
చర్చించాల్సిన అంశాల ప్రతిపాదనలను సిద్ధం చేయాలని విభాగాధిపతులకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) నీలం సాహ్ని ఆదేశాలు జారీ చేశారు. ఈనెల 13 సాయంత్రం 5 గంటలలోపు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని చెప్పారు.