ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'90 శాతంపైగా ఎన్నికల హామీలు పూర్తయ్యాయి' - news on asra scheme

సెప్టెంబర్ తర్వాతే రాష్ట్రంలో అభివృద్ధి పనులు చేసేందుకు ఆర్థిక వెసులుబాటు దొరుకుతుందని సీఎం జగన్ అన్నారు. పాఠశాలల పున‍ః ప్రారంభం విషయంలో కేంద్రం మార్గదర్శకాల ప్రకారమే వెళ్లాలని మంత్రులతో అన్నారు. కేంద్రం ఏర్పాటు చేయనున్న మూడు బల్క్ డ్రగ్‌ పార్కుల్లో ఒకదాన్ని తప్పకుండా దక్కించుకోవాలని స్పష్టం చేశారు.

ap cabinet internal things
ఏపీ కేబినెట్

By

Published : Aug 20, 2020, 8:04 AM IST

ఆసరా పథకాన్ని ప్రారంభించడం ద్వారా ఎన్నికల హామీల్లో 90 శాతంపైగా పూర్తి చేసినట్టవుతుందని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. సెప్టెంబర్‌లో ఆసరా తొలివిడత డబ్బు విడుదల చేశాక అక్టోబర్‌ నుంచి ఇతర పనులు చేపట్టేందుకు ప్రభుత్వానికి కొంత ఆర్థిక వెసులుబాటు కలుగుతుందని మంత్రులతో చెప్పినట్టు తెలిసింది. రాష్ట్రవ్యాప్తంగా రహదారుల మరమ్మతులు, డ్రైనేజీ నిర్మాణాలల కోసం క్షేత్రస్థాయిలో డిమాండ్‌ ఉందని.. వీటికి నిధులు కేటాయించాలని శంకరనారాయణ, తానేటి వనిత కోరారు. దీనికి సీఎం స్పందిస్తూ.. సెప్టెంబర్ లో ఆసరా మొదటి విడతకు 6,700 కోట్లు ఇచ్చేశాక కాస్త వెసులుబాటు ఉంటుందన్నారు. పట్టణ నియోజకవర్గాలకు ప్రత్యేకంగా నిధులివ్వాలని అంజాద్ బాషా, వెల్లంపల్లి శ్రీనివాస్ అడిగారు. విజయవాడకు 100 కోట్లు ఇచ్చాం కదా అని సీఎం వ్యాఖ్యానించగా... ఆర్థికశాఖ క్లియరెన్స్ ఇవ్వలేదని.. ఇప్పించాలని మంత్రి వెల్లంపల్లి కోరారు.

కేంద్ర మార్గదర్శకాల ప్రకారమే పాఠశాలల పున‍ః ప్రారంభం

పాఠశాలలు తెరవడంపైనా చర్చ జరిగింది. సెప్టెంబర్‌ 5 నుంచి బడులు తెరవాలనుకుంటున్నా... తల్లిదండ్రులు పిల్లలను పంపేందుకు భయపడుతున్నారని శంకరనారాయణ అన్నారు. దీనికి సీఎం స్పందిస్తూ.. కేంద్రం నిబంధనల ప్రకారం వెళ్దామన్నారు. ఎక్కడో ఒకచోట కరోనా నుంచి బయటపడి సాధారణ కార్యకలాపాలు మొదలు పెట్టాలని... ఏడాది అంతా వాయిదా వేసుకోలేం కదా అన్నారు. కేంద్రప్రభుత్వం దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయనున్న మూడు బల్క్ డ్రగ్‌ పార్కుల్లో గట్టిగా పోటీపడి ఒకదాన్ని సాధించుకోవాలని సీఎం స్పష్టం చేశారు. దీని కోసం 2 వేల ఎకరాలు, రాష్ట్ర పెట్టుబడిగా 300 కోట్లు పెట్టాలని... ఇందుకు ప్రైవేటు వారు ముందుకొచ్చినా ప్రోత్సహించాలని అన్నారు. పీపీఈ విధానంలో ఏర్పాటుకు పరిశీలిద్దామన్నారు. అజెండాలో ఉన్నా.. అదానీ డేటా సెంటర్‌ ఏర్పాటుపై మంత్రి మండలి ఆమోదం తెలపలేదు. గోపాలమిత్ర ఖాళీలను శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేస్తున్నందున ఇప్పటికే పని చేస్తున్నవారిలో అర్హులకు అవకాశం ఇవ్వాలని సీదిరి అప్పలరాజు కోరారు. తాత్కాలిక నియామకాల్లో వచ్చి వారి కోసం డిగ్రీ నుంచి అర్హతను తగ్గించలేమని సీఎం అన్నారు.

ఏపీ కేబినెట్

ఇదీ చదవండి: 'డ్వాక్రాకు ఆసరా'.. 'డిసెంబర్ 1 నుంచి ఇంటి వద్దకే బియ్యం'..

ABOUT THE AUTHOR

...view details