సీఎం జగన్ పోలవరం పర్యటన కేవలం ఓట్ల కోసం తాపత్రయమేనని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు. ముఖ్యమంత్రి పోలవరం షెడ్యూల్ చూస్తే.. దేనికో అర్థమవుతోందంటూ సోము వీర్రాజు ట్వీట్ చేశారు. పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతవాసులపై.. సీఎంకు ఏమాత్రం శ్రద్ధ లేదన్నారు. ప్రాజెక్టు కోసం అన్నీ వదులుకున్న వారిని ముఖ్యమంత్రి పట్టించుకోవట్లేదని.. సోము వీర్రాజు ఆరోపించారు. సీఎం కొంత సమయం అయినా పునరావాస ప్రాంతాలలో పర్యటించి, వారు పడుతున్న అనేక అవస్థలను ప్రత్యక్షంగా చూడాలన్నారు. వారి పరిస్థితిపై అధికారులతో సమీక్షించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
SOMU VEERRAJU: ఓట్ల కోసమే.. సీఎం జగన్ పోలవరం పర్యటన: సోము వీర్రాజు - సీఎం జగన్ పోలవరం పర్యటన
పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతవాసులపై.. సీఎంకు ఏ మాత్రం శ్రద్ధ లేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు. సీఎం జగన్ పోలవరం పర్యటన కేవలం ఓట్ల కోసమే అని విమర్శించారు.
![SOMU VEERRAJU: ఓట్ల కోసమే.. సీఎం జగన్ పోలవరం పర్యటన: సోము వీర్రాజు ap bjp president comments on cm jagan](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12505473-146-12505473-1626686069722.jpg)
ap bjp president comments on cm jagan