ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

APASSEMBLY SESSIONS: 21 లేదా 22 నుంచి అసెంబ్లీ సమావేశాలు! - ap top news

ఈ నెల 21 లేదా 22 నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. వారం రోజులు లేదా 5 పనిదినాలు ఈ సమావేశాలు ఉండనున్నట్లు అధికారులు చెబుతున్నారు. తిరిగి డిసెంబరులో మరోసారి అసెంబ్లీ సమావేశమయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ap-assembly-meetings-from-21-or-22
21 లేదా 22 నుంచి అసెంబ్లీ సమావేశాలు!

By

Published : Sep 4, 2021, 7:11 AM IST

అసెంబ్లీ వర్షాకాల సమావేశాలను ఈ నెల 21 లేదా 22 నుంచి ప్రారంభించే అవకాశం ఉందని తెలిసింది. వారం రోజులు లేదా 5 పనిదినాలు ఉండేలా ఈ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. తిరిగి డిసెంబరులో మరోసారి సమావేశాలను నిర్వహించే అవకాశం కూడా ఉన్నట్లు తెలిసింది. ఈ నెలలోనే ఒకేసారి ఎక్కువ రోజులు సమావేశాలు నిర్వహించడం కంటే ఈ నెలలో ఐదు రోజులు.. డిసెంబర్​లో మరో ఐదు లేదా వారం రోజులు నిర్వహిస్తే బాగుంటుందన్న ప్రతిపాదన ఉన్నట్లు సమాచారం.

దీనిపై ప్రభుత్వం ఇంకా తుదినిర్ణయానికి రావాల్సి ఉంది. మరోవైపు ఈ నెలలో అసెంబ్లీ సమావేశాల సమయంలోనే శాసనమండలి ఛైర్మన్, డిప్యూటీ ఛైర్మన్​ల ఎన్నికలు నిర్వహించాలని గతంలో ప్రాథమికంగా నిర్ణయించినప్పటికీ.. ఇప్పుడు దీనిపై పునరాలోచిస్తున్నట్లు తెలిసింది. స్థానిక సంస్థల కోటాలో 11 ఎమ్మెల్సీల ఖాళీలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. వీటికి ఎన్నికలు జరిగితే దాదాపు అన్ని స్థానాలను దక్కించుకునే అవకాశం ఉందని అధికార వైకాపా అంచనా వేస్తోంది. అలా సాధించి సంపూర్ణ మెజారిటీతో శాసనమండలిలో ఛైర్మన్, డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికలకు వెళ్తే.. బాగుంటుందన్న ప్రతిపాదనపై చర్చ జరుగుతున్నట్లు చెబుతున్నారు.

ఇదీ చూడండి:HIGH COURT: తల్లుల ఖాతాల్లో బోధన రుసుములా!

ABOUT THE AUTHOR

...view details