ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రైతులందరికీ 100 శాతం సబ్సిడీతో విత్తనాలు: కన్నబాబు - వరద బాధితులు

కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోని ముంపు ప్రాంతాలను మంత్రి కురసాల కన్నబాబు పరిశీలించారు. పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. రైతులకు 100శాతం సబ్సిడీతో విత్తనాలు అందిస్తామని మంత్రి పేర్కొన్నారు.

రైతులందరికీ 100 శాతం సబ్సిడీతో విత్తనాలు : కన్నబాబు

By

Published : Aug 21, 2019, 8:02 PM IST

రైతులందరికీ 100 శాతం సబ్సిడీతో విత్తనాలు : కన్నబాబు
కృష్ణాజిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు పర్యటించారు. వ్యవసాయ మిషన్ వైస్ ఛైర్మన్ నాగిరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబులతో కలిసి నీటమునిగిన పసుపు, అరటి, కంద, బొప్పాయి పంటలను పరిశీలించారు. రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పులిగడ్డలో వరద బాధిత కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.

పంటలకు ఇన్సూరెన్స్
కృష్ణా వరదలతో నష్టపోయిన రైతులకు 100 శాతం సబ్సిడీపై విత్తనాలు అందించి ఆదుకుంటామని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. కృష్ణాజిల్లా పెనమలూరు, తోట్లవల్లూరు మండలాల్లోని వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించిన మంత్రి పంట నష్టాన్ని పరిశీలించారు. ఇన్‌పుట్ సబ్సిడీ చెల్లింపుల నిబంధనలు సడలించి వీలైనంత ఎక్కువ పరిహారం అందిస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వం మానవతా దృష్టితో సాయం అందిస్తుందని తెలిపారు. కృష్ణాజిల్లాలో 25 వేల ఎకరాలలో వాణిజ్య పంటలు నష్టపోయాయని మంత్రి చెప్పారు. పంటలకు ఇన్సూరెన్స్ అందిస్తామని.. రుణాలు రీషెడ్యూల్ చేసే అవకాశాలపై బ్యాంకర్లతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. రైతులకు సాయం అందించేందుకు ముఖ్యమంత్రి సానుకూలంగా ఉన్నారని మంత్రి స్పష్టం చేశారు. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రిజర్వాయర్లు నిండి కళకళలాడుతున్నాయని పేర్కొన్నారు.

ప్రతిపక్షం విమర్శలు హాస్యాస్పదం
ప్రతిపక్షనేత చంద్రబాబు వరదలను సైతం రాజకీయం చేశారని ఆరోపించారు. కృత్రిమంగా వరదలు సృష్టించారని తెదేపా నేతలు చెప్పడం హాస్యాస్పదం అన్నారు. చంద్రబాబు రైతుల బాధలు వినకుండా వరదతో తన ఇంటిని ముంచారనడం సిగ్గుచేటని విమర్శించారు.

ABOUT THE AUTHOR

...view details