ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

150వ రోజుకు చేరిన అమరావతి రైతుల దీక్షలు - అమరావతి రైతుల ధర్నా

రాష్ట్రరాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రైతులు చేస్తున్న ఆందోళనలు 150వ రోజుకు చేరాయి. కరోనా లాక్​డౌన్​ నేపథ్యంలో రాజధాని గ్రామాల్లోనే వారివారి ఇళ్లవద్ద నిరసనలు తెలియచేస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయం మార్చుకునే వరకు పోరాటం ఆపేది లేదని ముక్తకఠంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు.

150వ రోజుకు చేరిన అమరావతి రైతుల దీక్షలు
150వ రోజుకు చేరిన అమరావతి రైతుల దీక్షలు

By

Published : May 15, 2020, 3:10 PM IST

రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రైతులు చేస్తున్న ధర్నాలు 150వ రోజుకు చేరుకున్నాయి రాజధాని గ్రామాల్లోని రైతులంతా తమ ఇళ్ల వద్ద నిరసన తెలియచేస్తున్నారు. తుళ్ళూరు మండలంలో రాజధాని ఐకాస నేతలు దీక్ష చేపట్టారు. విశాఖ గ్యాస్ లీకేజీ ఘటనలో మృతి చెందిన వారికి, ప్రకాశం జిల్లాలో విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న ప్రమాదంలో మృతి చెందిన వ్యవసాయ కూలీలకు నేతలు సానుభూతి తెలియజేశారు. రాత్రి ఏడున్నర గంటలకు ఇళ్ల వద్ద అమరావతి వెలుగు పేరుతో కొవ్వొత్తులు వెలిగించి తమ నిరసనను తెలియజేయనున్నారు. ప్రభుత్వం దిగి వచ్చే వరకు ఎన్ని రోజులైనా ఉద్యమాలను కొనసాగిస్తామని రైతులు మహిళలు తేల్చి చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details