ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'కరోనాతో పాటు ఎల్లో వైరస్​ను ఎదుర్కోవాల్సి వస్తోంది' - kannababu yello virus comments

విపత్కర పరిస్థితుల్లో ప్రతిపక్షాలు రాజకీయాలు చేయడం తగదని వ్యవసాయ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నియంత్రణ కోసం పటిష్ట చర్యలు తీసుకుంటుంటే.. తెదేపా నేతలకు అవి కనిపించడం లేదా అని మంత్రి నిలదీశారు. రైతు భరోసాపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

'కరోనాతో పాటు ఎల్లో వైరస్​ను ఎదుర్కోవాల్సి వస్తోంది'
'కరోనాతో పాటు ఎల్లో వైరస్​ను ఎదుర్కోవాల్సి వస్తోంది'

By

Published : Apr 29, 2020, 8:52 PM IST

విపత్కర పరిస్థితుల్లో అనవసర ఆరోపణలు వద్దన్న కన్నబాబు

రాష్ట్రంలో ప్రస్తుతం కరోనాతో పాటు ఎల్లో వైరస్‌నూ ఎదుర్కోవాల్సి వస్తోందని మంత్రి కన్నబాబు ఎద్దేవా చేశారు. తెదేపా అధినేత చంద్రబాబు లేనిపోని లేఖలు రాసి గందరగోళం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. కరోనా బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తుంటే తెదేపా నేతలకు అది కనిపించడం లేదా.. అని మంత్రి ప్రశ్నించారు. క్వారంటైన్‌ కేంద్రాల్లో వసతులు బాలేవని ఆరోపిస్తున్న చంద్రబాబు.... హైదరాబాద్‌ నుంచి వచ్చి పరిశీలించాలని సవాల్‌ చేశారు. రైతుభరోసా పథకం నుంచి లబ్ధిదారుల తొలగింపుపై తెదేపా చెప్తున్న లెక్కలన్నీ తప్పేనన్న మంత్రి.. రెండో విడతకు సంబంధించి అసలు జాబితాలే ఖరారు కాలేదని అన్నారు. గ్రామ సచివాలయాల్లో ఈ జాబితాలు ప్రదర్శిస్తున్నామని మంత్రి వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details