ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

AP Adhikara Bhasha Sangam Chairman Vijayababu Reaction: ఆ లేఖపై సంతకం చేయలేదు.. నిరూపిస్తే రాజీనామా: అధికార భాషా సంఘం చైర్మన్ విజయబాబు - ఆహ్వాన పత్రిక

Telugu language celebrations : తెలుగు భాషా వారోత్సవాలతో ఓ యజ్ఞం చేస్తున్నామని అధికార భాషా సంఘం ఛైర్మన్ విజయబాబు అన్నారు. ఈ యజ్ఞాన్ని భంగం కలిగించేందుకు కొన్ని తీతువుపిట్టలు ఆటంకం సృష్టించే ప్రయత్నం చేస్తున్నాయని తెలిపారు. పురస్కారాల ఎంపిక కోసం లేఖలు పంపే క్రమంలో మానవ తప్పిదం వల్ల కొన్ని అక్షర దోషాలు జరిగాయని, ఆ లేఖలపై తాను సంతకం చేయలేదని వివరణ ఇచ్చారు.

Telugu_language_celebrations
Telugu_language_celebrations

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 28, 2023, 5:20 PM IST

AP Adhikara Bhasha Sangam Chairman Vijayababu Reaction: గిడుగు రామ్మూర్తి జయంతి సందర్భంగా తెలుగు భాషా వారోత్సవాలు జరుగుతున్నాయని అధికార భాషా సంఘం ఛైర్మన్ విజయబాబు తెలిపారు. బెజవాడ బార్ అసోసియేషన్ కూడా తొలిసారిగా భాషా వారోత్సవాల్లో పాల్గొనడం సంతోషించదగ్గ విషయమని పేర్కొన్నారు. ఉద్యోగుల్లో తెలుగు భాషలో సృజనాత్మకతప్రదర్శించిన వారికి ప్రోత్సాహకాలు ఉంటాయని వెల్లడించారు. తాము భాష (Telugug Language) వారోత్సవాలతో ఓ యజ్ఞం చేస్తున్నామన్న విజయబాబు.. ఈ యజ్ఞాన్ని భంగం కలిగించేందుకు కొన్ని తీతువుపిట్టలు ఆటంకం సృష్టించే ప్రయత్నం చేస్తున్నాయని తెలిపారు.

మన మాతృభాష తేట తెలుగు తీయదనం అందరికీ పంచాలి: మంత్రి బొత్స

Telugu Language Celebrations on the Occasion of Gidugu Rammurthy Jayanti: పురస్కారాల ఎంపిక కోసం లేఖలు పంపే క్రమంలో మానవ తప్పిదం వల్ల కొన్ని అక్షర దోషాలు జరిగాయని చెప్పారు. ఆ లేఖల్లో అక్షరాలను సవరించి తిరిగి పంపించామని అన్నారు. లేఖపై తాను సంతకం చేయలేదని.. తాను సంతకం (Signature) చేశానని నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమని విజయబాబు స్పష్టం చేశారు. జగన్ ప్రాపకం కోసం కాదు.. జగన్ (Jagan) ప్రాభవం కోసం పని చేస్తున్నానని చెప్పారు. లోకేశ్ (Lokesh) కు వర్ధంతి, జయంతికి తేడా తెలీదు.. ప్రశాంతత అనలేక ప్రశాంతత్త అని పలుకుతారని ఎద్దేవా చేశారు. జగన్ మాట్లాడే వాటిల్లో కొంత తడబాటు వల్ల వచ్చే పొరపాట్లు ఉన్నాయి. సీఎం జగన్ తన ప్రసంగంలోఅదనపు పదాలను జోడించి ఊపును, ఉత్సాహాన్ని తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. తడబాట్లు వేరు.. పదాలు పలకలేకపోవటం వేరని విజయబాబు చెప్పుకొచ్చారు.

Telugu language celebrations : సీఎం జగన్ ప్రాభవం కోసం పని చేస్తున్నాను : అధికార భాషా సంఘం చైర్మన్ విజయబాబు

విశాఖకు అధికార భాషా సంఘం కార్యాలయం

ఆగస్టు 23 నుంచి 29 వరకు భాషా చైతన్య వారోత్సవాలు జరపాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. ఆ మేరకు అధికార భాషా సంఘం, తెలుగు భాషాభివృద్ధి ప్రాధికార సంస్థ సంయుక్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు చేపడుతోంది. అధికార యంత్రాంగంతోపాటు విద్యాశాఖ అధికారులను సమన్వయం చేసుకుంటూ ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నాం. ఆంధ్రా, నాగార్జున యూనివర్సిటీల నుంచి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఈ నేపథ్యంలో జరిగిన మానవ తప్పిదాలను పనిగట్టుకుని ఎత్తి చూపుతున్నారు. గిడుగు రామ్మూర్తి జయంతి సందర్భంగా ఆహ్వాన పత్రాలు తయారు చేసి పంపించాలనుకున్నాం. కానీ, ఆపరేటర్ కంగారులో తప్పులున్న కాపీని పంపించారు. ఆ తర్వాత క్షమాపణలు కోరుతూ వేరే లెటర్ పంపిస్తామన్నారు. కానీ, తప్పులున్న ఓ పత్రిక దొరికేసరికి అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. వారం రోజులుగా చేస్తున్న కార్యక్రమాలపై ప్రసంశలు లేవు గానీ.. గజ్జెల మల్లారెడ్డి చెప్పినట్లుగా.. సోషల్ మీడియాలో తెలుగు పైత్యం.. మురుగు కాలువలై పారుతోంది. డ్రైనేజీ స్కీం లేక డేంజర్ గా మారుతోంది. అన్నట్టుగా ఉంది. మానవ తప్పిదం కారణంగా జరిగిన తప్పిదాలపై నాకు సంబంధం లేదు. ఆహ్వాన పత్రిక కాపీలపై నా సంతకం కూడా లేదు. ఈ విషయాన్ని ఎవరైనా రుజువు చేస్తే రాజీనామాకు నేను సిద్ధం. జర్నలిజంలో నా సుదీర్ఘ ప్రస్థానంలో ఎంతో మంది ప్రముఖుల ప్రశంసలు అందుకున్న వ్యక్తిని నేను. ఎమ్మెస్సీ, లా కూడా చదివాను. నాకు తెలుగు రాదని తీతువుపిట్టలు కూస్తున్న నేపథ్యంలో నేను సమాధానం చెప్పాల్సి వస్తోంది. -విజయబాబు, అధికార భాషా సంఘం చైర్మన్

'ఇకపై అన్ని బడుల్లో తెలుగు వెలుగుతుంది'

ABOUT THE AUTHOR

...view details