మాజీమంత్రి దేవినేని వెంకటరమణ ప్రణీతల ఎత్తిపోతల పథకం, చింతలపాడు ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల అధ్యక్షులు అనుమోలు పద్దయ్య దశదిన కార్యక్రమంలో.. తెదేపా నాయకులు ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. మాజీ శాసన సభ్యురాలు తంగిరాల సౌమ్య చేతులమీదుగా.. కృష్ణాజిల్లా నందిగామలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
నందిగామలో అనుమోలు పద్దయ్య విగ్రహ ఆవిష్కరణ - నందిగామలో చింతలపాడు పీఏసీఎస్ అధ్యక్షులు విగ్రహావిష్కరణ
ఎత్తిపోతల పథకం, పరపతి సంఘాలకు అధ్యక్షులుగా సేవలందించిన అనుమోలు పద్దయ్య విగ్రహం.. కృష్ణాజిల్లా నందిగామలో ఆవిష్కరించారు. మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య చేతల మీదుగా.. తెదేపా శ్రేణులతో కలిసి ఈ కార్యక్రమం నిర్వహించారు.
విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న మాజీ ఎమ్మెల్యే సౌమ్య
పద్దయ్య లేని లోటు పార్టీకి తీవ్ర నష్టం అని మాజీ ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఎస్టీ కాలనీలో పేద ప్రజల కోసం తన సొంత నిధులతో ఆయన ఇళ్ల నిర్మాణం చేపట్టారని గుర్తు చేసుకున్నారు. విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఇదీ చదవండి:కేంద్ర విధానాలే రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నాయి: సీపీఎం