ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎలక్ట్రానిక్‌ వాహనాల రంగంలో తెలంగాణకి మరో భారీ పెట్టుబడి

తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి రానుంది. ఎలక్ట్రానిక్‌ వాహనాల రంగంలో రూ. 2,100 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ఈవీ రంగంలో దిగ్గజ కంపెనీగా పేరొందిన ట్రైటాన్(triton)..ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది.

Another huge investment for telangana in electronic vehicles
ఎలక్ట్రానిక్‌ వాహనాల రంగంలో తెలంగాణకి మరో భారీ పెట్టుబడి

By

Published : Jun 25, 2021, 7:12 AM IST

ఎలక్ట్రానిక్‌ వాహనాల రంగంలో తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి రానుంది. ఈవీ రంగంలో దిగ్గజ కంపెనీగా పేరొందిన ట్రైటాన్(triton) ఈవీ, తెలంగాణలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వంతో ... అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ మేరకు రాష్ట్రంలో సూమారు రూ. 2,100 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు తన సంసిద్ధతను వ్యక్తం చేసింది.

ప్రగతి భవన్​లో ఇవాళ జరిగిన సమావేశంలో పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్​తో సమావేశమై.. తమ పెట్టుబడి ప్రణాళికను వివరించింది. భవిష్యత్తులో భారీగా డిమాండ్ ఉండే ఈవీ రంగాన్ని పెద్ద ఎత్తున విస్తరించేందుకు తమ కంపెనీ ఇప్పటికే ప్రణాళికలతో సిద్ధంగా ఉందని మంత్రి కేటీఆర్​కు ట్రైటాన్ ఈవీకు తెలిపింది.

భారత్​లో తయారీ ప్లాంట్​ని ఏర్పాటు చేసేందుకు వివిధ రాష్ట్రాల్లో ఉన్న అవకాశాలను పరిశీలించిన తర్వాత తెలంగాణ కేంద్రంగా తమ కార్యకలాపాలను ముందుకు తీసుకుపోయేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ సీఈవో హిమాన్షు పటేల్... కేటీఆర్​కు తెలిపారు. పెట్టుబడుల విషయంలో తెలంగాణకు ఉన్న అవకాశాలను దృష్టిలో ఉంచుకుని పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ఈ మేరకు జహీరాబాద్ నిమ్జ్​లో తయారీ యూనిట్​ ఏర్పాటుకు సుముఖంగా ఉన్నామని ఆయన పేర్కొన్నారు.

ఇదీచూడండి:Reliance: తిరుపతిలో ఎలక్ట్రానిక్స్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ యూనిట్‌ ఏర్పాటు ప్రతిపాదన విరమణ

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details