రాష్ట్రానికి మరో లక్షా 32 వేల డోసుల కొవిడ్ టీకాలు చేరుకున్నాయి. టీకా డోసులతో పాటు అత్యవసర వైద్య సామగ్రి వచ్చింది. పుణెలోని సీరం ఇన్‌స్టిట్యూట్ నుంచి కొవిషీల్డ్ టీకా డోసులు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నాయి. 11 బాక్సుల్లో చేరిన టీకాలను గన్నవరంలోని రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి అధికారులు తరలించారు. అక్కడి నుంచి వైద్యఆరోగ్యశాఖ ఆదేశాలతో జిల్లాలకు తరలించనున్నారు. హైరిస్క్ కలిగిన 45 ఏళ్లకు పైబడ్డవారికి వ్యాక్సినేషన్ కొనసాగుతున్న వేళ తాజాగా చేరుకున్న టీకాలతో మరికొంత ఉపశమనం లభించనుంది.
రాష్ట్రానికి చేరుకున్న మరో 1.32 లక్షల కొవిడ్ టీకా డోసులు - covishield vaccine
రాష్ట్ర అవసరాల దృష్ట్యా... 1.32 లక్షల కొవిడ్ టీకా డోసులు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నాయి. పుణెలోని సీరం ఇన్‌స్టిట్యూట్ నుంచి వచ్చిన కోవిషీల్డ్ టీకాలను రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి తరలించారు.
రాష్ట్రానికి చేరుకున్న కొవిడ్ టీకా డోసులు