ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

లాక్​డౌన్ వేళ మూగజీవాల ఆకలి బాధలు - లాక్ డౌన్ సమయంలో మూగజీవాల బాధలు

లాక్​డౌన్ ప్రభావం​ మానవాళి మీదే కాదు మూగజీవాలపైన తీవ్రంగా పడింది. రోజుల కొద్ది తిండి దొరక్క నీరసించిపోతున్నాయి. ఆకలి చూపులతో ఏది కనిపించినా ఆహారం అనుకుని పరుగులు పెడుతున్నాయి. చివరకు గుక్కెడు నీళ్ల కోసం కుండల్లో తల పెట్టి ఇరుక్కుపోతున్నాయి. ఇలాంటి ఘటన కృష్ణా జిల్లా కోసూరువారిపాలెంలో జరిగింది.

లాక్​డౌన్ వేళ మూగజీవాల ఆకలి బాధలు
లాక్​డౌన్ వేళ మూగజీవాల ఆకలి బాధలు

By

Published : Apr 20, 2020, 8:17 AM IST

లాక్​డౌన్ వేళ మూగజీవాల ఆకలి బాధలు

లాక్‌డౌన్‌ ప్రభావం మనుషుల మీదే కాకుండా జంతువులపైనా తీవ్రంగా పడింది. ఫలితంగా తిండి దొరక్క ముగజీవాలు అలమటిస్తున్నాయి. ఆహారం దొరక్క.. ఆకలి బాధ తట్టుకోలేక గుక్కెడు నీరు తాగి సరిపెట్టుకుంటున్నాయి. వీధుల్లో తిరిగే కుక్కలు లాక్​డౌన్ ప్రభావంతో తిండి దొరక్క నీటికోసం కుండల్లో తల పెట్టి ఇరుక్కుపోతున్నాయి. ఇలాంటి ఘటన కృష్ణా జిల్లా మోపిదేవి మండలం కోసూరువారిపాలెంలో జరిగింది. గ్రామంలో ఓ శునకం ఆహారం కోసం డబ్బాలో తలపెట్టి ఇరుక్కుపోయింది. ఏమీ చెయ్యలేని పరిస్థితుల్లో గత నాలుగు రోజులుగా ఆకలిదప్పికలతో నీరసించిపోయింది. రోడ్డుపైకొచ్చి దిక్కుతోచని స్థితిలో తిరుగుతూ ఓ యువకుని కంట పడింది. జాలిపడిన అతను అతి కష్టం మీద డబ్బాను కత్తితో కోసి శునకానికి విముక్తి కలిగించాడు. అనంతరం కుక్కకు గుప్పెడు మెతుకులు పెట్టి మానవత్వం చాటుకున్నాడు.

ABOUT THE AUTHOR

...view details