Anganwadis Strike for Realization Of Their Demands:తమ డిమాండ్ల సాధన కోసం అంగన్వాడీలు చేపట్టిన సమ్మె తొమ్మిదో రోజూ ఉద్ధృతంగా సాగింది. జగన్ ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ నిరసనలతో అంగన్వాడీలు హోరెత్తించారు. విపక్షాలు, ప్రజాసంఘాలు సంఘీభావంగా ఆందోళనల్లో పాల్గొన్నాయి. సమస్యలు పరిష్కరించాలన్న డిమాండ్‌తో తొమ్మిది రోజులుగా ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వానికి, మంత్రులకు చీమకుట్టినట్లు కూడా లేదని అంగన్వాడీలు మండిపడ్డారు.
YSRCP Government Not Solve Anganwadi Problems: కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అనంతపురం జిల్లా సింగనమల తహశీల్దార్ కార్యాలయం వద్ద అంగన్వాడీలు వంటావార్పు నిర్వహించారు. అనంతరం రోడ్డుపై నిలబడి భోజనం చేశారు. నంద్యాల జిల్లా మహానందిలో అంగన్వాడీలు యాచకుల వేషధారణతో దుకాణాల వద్ద భిక్షాటన చేశారు. ప్రభుత్వం అంగన్వాడీలను అడుక్కుతినేలా చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తలపై మొండి వైఖరి విడనాడాలని డిమాండ్ చేస్తున్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు తహశీల్దార్ కార్యాలయం వద్ద బైఠాయించి నినాదాలు చేశారు. నంద్యాల జిల్లా డోన్‌లో జోలి పట్టుకుని యాచిస్తూ నిరసన తెలిపారు. అనంతరం మున్సిపల్ కార్యాలయం ఎదుట వంటావార్పు చేపట్టారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో పొట్టి శ్రీరాములు విగ్రహం నుంచి ఆర్టీసీ డిపో వరకు ర్యాలీ నిర్వహించిన అంగన్వాడీలు డబ్బాలు చేత పట్టుకుని భిక్షాటన చేశారు. కోవూరు ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయం వద్ద వంటావార్పు నిర్వహించారు.
పత్తికొండలో తీవ్ర ఉద్రిక్తత - మంత్రి బుగ్గనకు అంగన్వాడీల వినతిపత్రం