తమ సమస్యలను తక్షణమే పరిష్కరించకపోతే స్థానిక ఎన్నికల్లో వైకాపా తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని అంగన్వాడీ సంఘాల నాయకులు హెచ్చరించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం కలెక్టరేట్ ధర్నా చౌక్ వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమంలో అన్ని ప్రాంతాలకు చెందిన అంగన్వాడీ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కనీస వేతనం రూ.21వేలు చెల్లించాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను వర్తింపచేయాలని డిమాండ్ చేశారు.
కనీస వేతనం రూ.21వేలు ఇవ్వాలి: అంగన్వాడీలు
కృష్ణా జిల్లా మచిలీపట్నం కలెక్టరేట్ ధర్నాచౌక్ వద్ద అంగన్వాడీలు ధర్నా చేపట్టారు. తమకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. కనీస వేతనం రూ.21వేలు చెల్లించాలని కోరారు.
అంగన్వాడీ సంఘం