కరోనా కారణంగా తరగతులు జరగని 2019 బ్యాచ్ వైద్య విద్యార్థులను రెండో ఏడాదికి ప్రమోట్ చేయాలని ఆంధ్రప్రదేశ్ వైద్య విద్యార్థుల పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర కన్వీనర్ శ్రీనివాస విశ్వనాథ్ డిమాండ్ చేశారు. వారికి బ్యాక్‌లాగ్‌లు రాసుకునే అవకాశం కల్పించాలని కోరారు.
'2019 బ్యాచ్ వైద్య విద్యార్థులను రెండో ఏడాదికి ప్రమోట్ చేయాలి' - vijayawada latest news updates
కరోనా కారణంగా విద్యాసంస్థలు మూతపడ్డాయి. తరగతులు జరగకపోవడంతో కొన్ని పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసింది. ఈ జాబితాలో 2019బ్యాచ్‌కు చెందిన వైద్య విద్యార్థులూ ఉన్నారు. తరగతులు జరగకపోవడం వల్ల వారు ఇబ్బందులు పడుతున్నారని, వారిని పై తరగతులకు ప్రమోట్ చేయాలని ఏపీఎమ్ఎస్పీఏ డిమాండ్ చేసింది.
!['2019 బ్యాచ్ వైద్య విద్యార్థులను రెండో ఏడాదికి ప్రమోట్ చేయాలి' విజయవాడలో ఏపీఎమ్ఎస్పీఏ ఆందోళన](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12415329-268-12415329-1625910156399.jpg)
విజయవాడలో ఏపీఎమ్ఎస్పీఏ ఆందోళన
ఇప్పటికే రెండో సంవత్సరం తరగతులు ప్రారంభమైనందున.. ప్రభుత్వం, ఎన్టీఆర్ యూనివర్సిటీ అధికారులు చొరవ తీసుకొని 2019 బ్యాచ్ మెడిసిన్ విద్యార్థులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఎన్టీఆర్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ కె.శంకర్, ఉపకులపతి డా. శ్యాంప్రసాద్‌ను కలిసి సమస్యను వివరించారు. ఈ అంశంపై సత్వర చర్యలు తీసుకోకుంటే హైకోర్టును ఆశ్రయిస్తామని విశ్వనాథ్ హెచ్చరించారు.